కామినేని ఆ నిర్ణయం తీసుకున్నట్లేనా?

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. త్వరలో ఆయన బీజేపీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే ఆయన [more]

Update: 2021-03-27 03:30 GMT

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. త్వరలో ఆయన బీజేపీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచనలతో బీజేపీలో చేరారు కామినేని శ్రీనివాస్.

బీజేపీలో చేరి….

2014లో అధికారంలోకి రాగానే బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో ఆ కోటాలో కామినేని శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. ముఖ్యమైన వైద్య ఆరోగ్యశాఖను చంద్రబాబు కామినేని శ్రీనివాస్ కు అప్పగించారు. అయితే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడంతో కామినేని శ్రీనివాస్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు.

వీర్రాజు వచ్చిన తర్వాత…

బీజేపీలో కొత్త అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత కామినేని శ్రీనివాస్ కు ప్రయారిటీ తగ్గింది. సుజనా చౌదరి వంటి వారితో సఖ్యత కారణంగా సోము వీర్రాజు కామినేనిని దూరం పెట్టారు. అయితే ఇటీవల వెంకయ్యనాయుడును కలసిన కామినేని శ్రీనివాస్ తన మనసులో మాటను చెప్పినట్లు తెలిసింది. ఏపీలో బీజేపీకి భవిష‌్యత్ ఉండదని, ఉన్నా తన లాంటి నేతలకు ప్రాధాన్యత ఉండదని, పార్టీ మారాలనుకుంటున్నానని ఆయన చెప్పుకున్నట్లు సమాచారం.

టీడీపీలో చేరేందుకు….

వెంకయ్య నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కామినేని శ్రీనివాస్ త్వరలోనే బీజేపీని వీడతారని తెలుస్తోంది. అయితే సోము వీర్రాజు వ్యతిరేక వర్గం అంతా ఒక్కసారిగా బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయనకు షాక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ మాత్రం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అందుకే బీజేపీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటుననారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News