కామినేని వెనకున్నది ఆయనేనా?

దాదాపు మూడేళ్ల నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. అసలు పార్టీలో ఉన్నారో? లేదో? తెలియదు. ఉన్నా లేనట్లే అన్నది ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతుంటారు. ఆయన [more]

Update: 2020-06-08 06:30 GMT

దాదాపు మూడేళ్ల నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. అసలు పార్టీలో ఉన్నారో? లేదో? తెలియదు. ఉన్నా లేనట్లే అన్నది ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతుంటారు. ఆయన కామినేని శ్రీనివాస్. బీజేపీ నేత. ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కామినేని శ్రీనివాస్ కు అవినీతి రహిత నేతగా మంచి పేరుంది. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి మరోసారి బీజేపీ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఇప్పడు తాను అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటున్నానని చెబుతున్నారు.

మూడేళ్లపాటు మౌనంగా ఉండి….

ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలకు కూడా కామినేని శ్రీనివాస్ హాజరు కాలేదు. అలాగే పార్టీ కార్యక్రమాలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని రగడ విషయంలోనూ కామినేని శ్రీనివాస్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. అమరావతి ప్రాంతంలో నిరసన తెలియజేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. కానీ ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కామినేని శ్రీనివాస్ హైలెట్ అయ్యారు. బీజేపీ నేతగానే ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టులో పిటీషన్ వేశారు.

నిమ్మగడ్డ విషయంలో…..

రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కామినేని శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై అనేక మంది పిటీషన్లు వేసినా కామినేని శ్రీనివాస్ హైలెట్ అయ్యారు. ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని హైకోర్టు ఆదేశించడంతో కామినేని శ్రీనివాస్ విజయం సాధించినట్లయింది. అయితే ఆ తర్వాత ఆయన తాను అధిష్టానం ఆదేశం మేరకే కేసును హైకోర్టులో వేసినట్లు ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది.

ఢిల్లీ స్థాయిలో నేత ఒకరు…

ఢిల్లీలో ఒక కీలక పోస్టులో ఉన్న పెద్దాయన సూచన మేరకు కామినేని శ్రీనివాస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో పిటీషన్ వేశారని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ మాత్రం తాను జేపీ నడ్డాకు చెప్పిన తర్వాతనే కేసును హైకోర్టులో వేశానంటున్నారు. ఇలా ఢిల్లీ స్థాయిలో జేపీ నడ్డాకు చెప్పిన నేత ఎవరన్న చర్చ పార్టీలోనే కాకుండా వైసీపీలోనూ జరుగుతోంది. జేపీ నడ్డా కాకుండా కామినేని శ్రీనివాస్ ను ఢిల్లీ స్థాయిలో ఆదేశించిందెవరన్నది చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కామినేని శ్రీనివాస్ కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళుతున్నారు. జనసేన, బీజేపీ కలసిన తర్వాతనే కామినేని శ్రీనివాస్ యాక్టివ్ అయ్యారని కూడా కొందరు అంటున్నారు.

Tags:    

Similar News