వైసీపీ ఎమ్మెల్యే హ్యాండ్సప్.. కారణం ఆ నేతేనట?

శ్రీకాకుళం జిల్లాలోని కీలక‌మైన ఎస్సీ అసెంబ్ల నియోజ‌క‌వ‌ర్గం రాజాం. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు కంబాల జోగులు. వైసీపీకి అంత్యంత న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడిగానే కాకుండా జ‌గ‌న్‌కు [more]

Update: 2020-09-08 13:30 GMT

శ్రీకాకుళం జిల్లాలోని కీలక‌మైన ఎస్సీ అసెంబ్ల నియోజ‌క‌వ‌ర్గం రాజాం. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు కంబాల జోగులు. వైసీపీకి అంత్యంత న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడిగానే కాకుండా జ‌గ‌న్‌కు ఆత్మీయుడిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న‌పై ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శలు తార‌స్థాయిలో వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్యలను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏ స‌మ‌స్య చెప్పేందుకు వెళ్లినా.. పెద్దాయ‌న‌కు చెప్పుకోండి.. నా చేతుల్లో ఏమీ లేద‌ని చెబుతున్నార‌ని ప్రజ‌లు చెబుతున్నారు. నిజమే.. కంబాల జోగులు వ‌ద్దకు ఎవ‌రెళ్లి ఏం చెప్పినా.. స‌ద‌రు స‌మ‌స్య వింటున్నప్పటికీ.. ప‌రిష్కారం విష‌యంలో మాత్రం చేతులు ఎత్తేస్తున్నార‌ట‌.

రెండుసార్లు గెలిచినా….

దీంతో కంబాల జోగులు ఏమీ గోల‌! అంటూ.. స్థానికంగా ప్రజ‌లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి కంచుకోట వంటి రాజాంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ విజ‌యం సాధించింది. ఈ రెండు సార్లు కూడా కంబాల జోగులు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే ఆయ‌న తొలిసారి గెలిచిన‌ప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు.. ఇక రెండోసారి గెలిచిన‌ప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. కంబాల జోగులు ‌గెలుపు వెనుక పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌ర్ చ‌క్రం తిప్పిన విష‌యం తెలిసిందే. రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో పాల‌వ‌ల‌స కుటుంబ ఆధిప‌త్యం కొన్ని ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది. జిల్లాలో పాల‌కొండ‌, రాజాం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మంచి ప‌ట్టు ఉంది.

ఏడాదిన్నరగా ఏమీ చేయలేక….

ఇప్పుడు రాజ‌శేఖర్ కుమారుడు విక్రాంత్ ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కంబాల జోగులుకు అన్ని విధాలా పాల‌వ‌ల‌స కుటుంబం అండ‌గా ఉంది. అయితే, ఎంత పాల‌వ‌ల‌స పాత్ర ఉన్నప్పటికీ.. త‌న‌కు ఓట్లేసి గెలిపించిన వారిప‌ట్ల కంబాల జోగులుకు బాధ్యత లేదా ? అనేది కీల‌క ప్రశ్న. ప్రతి విష‌యాన్ని.. ప్రతి స‌మ‌స్య‌ను త‌న‌ది కాద‌న్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ఐదేళ్లు అంటే.. పార్టీ ప్రతిప‌క్షంలోఉంది క‌నుక తాను ఏమీ చేయ‌లేక పోయాన‌ని చెప్పుకొన్నా.. అర్ధం ఉంది. కానీ, ఇప్పుడు పార్టీ అధికారంలోనే ఉన్నప్పటికీ.. గ‌డిచిన ఏడాదిన్నర‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేకుండా పోవ‌డంపై స‌ర్వత్రా ఆవేద‌న వ్యక్తమ‌వుతోంది.

తన చేతుల్లో ఏమీ లేదని…..

అంతేకాదు.. త‌న‌ను ఎవ‌రైనా ఏదైనా అడిగితే.. అంతా పెద్దాయ‌న చేతుల్లోనే ఉంద‌ని, వారినే వెళ్లి క‌ల‌వాల‌ని అంటున్నార‌ట‌. ఓ వైపు క‌రోనా స్వైర‌విహారం చేస్తోన్న వేళ కంబాల జోగులు అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేద‌ట‌. నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌ను క‌ల‌వ‌డం లేద‌ట‌. ఒక‌రిద్దరు నేత‌లు వెళ్లి ఆయ‌న ద‌ర్శన‌భాగ్యం చేసుకున్నా కూడా ఏ మాత్రం సంకోచించ‌కుండా పెద్దాయ‌న‌ను క‌ల‌వ‌మ‌ని చెప్పేస్తున్నార‌ని రాజాం టాక్‌. దీంతో కంబాల ఎమ్మెల్యేనా.. లేక కంబాల జోగులుకు టికెట్ ఇప్పించిన పాల‌వ‌ల‌స షాడో ఎమ్మెల్యేనా? అని ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. మ‌రిఇలా అయితే.. కంబాల జోగులు రాజ‌కీయంగా ఎదిగేది ఎప్పుడు ? అన్నది పెద్ద ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Tags:    

Similar News