అంతకు మించి మరో మార్గం లేదు

కమల్ నాధ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. స్పష్టంగా ఆయనకు సంఖ్యాబలం లేదని తెలిసిపోతుంది. గవర్నర్ సయితం బీజేపీ చేతులో ఉన్నారు. ఇక చేయగలిగిందేమీ లేదు. [more]

Update: 2020-03-11 16:30 GMT

కమల్ నాధ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. స్పష్టంగా ఆయనకు సంఖ్యాబలం లేదని తెలిసిపోతుంది. గవర్నర్ సయితం బీజేపీ చేతులో ఉన్నారు. ఇక చేయగలిగిందేమీ లేదు. తిరిగి ఢిల్లీకి వచ్చి సేదతీరడమే. కమల్ నాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి పదిహేను నెలలు అవుతుంది. అయితే పాలనలో ఆయన గట్టిగానే ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నారు. పాలన నిలకడగా సాగుతున్న దిశలో కుదుపు వచ్చింది.

అత్యవసర సమావేశానికి…..

నిజానికి అత్యవసర సమావేశం పెడితే ఈ పరిస్థితుల్లో పార్టీ ఎమ్మెల్యేలు పరుగులు తీస్తూ వస్తారు. కానీ 52 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉన్నారంటే కమల్ నాధ్ పరిస్థితి చెప్పకనే తెలుస్తోంది. ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదనుకున్నప్పుడు బీఎస్పీ, ఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎందుకు ఆయనపై ప్రేమ ఒలకబోస్తారు. వారు ఇప్పటికే బీజేపీలోకి టచ్ లోకి వెళ్లిపోయారు.

బలం ఎటు చూసినా….

దీంతో ఇక కమల్ నాధ్ విధిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 228 మంది సభ్యులున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 114 అయింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా వెంట 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లి పోవడంతో 92కు కాంగ్రెస్ బలం పడిపోయింది. ఇక ఎటు చూసుకున్నా బలం నిరూపించుకునే అవకాశం కమల్ నాధ్ కు లేదు.

అంతటి వ్యతిరేకత కొని తెచ్చుకుందే….

ఎమ్మెల్యేల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపడంలో కమల్ నాధ్ పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కమల్ నాధ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆయన వ్యవహారశైలి పదిహేను నెలల్లో ఎలా ఉందో? చెప్పకనే తెలుస్తోంది. ఇక కమల్ నాధ్ ముందు కే దారి. నిజాయితీగా బలం లేదని ఒప్పుకుని సీటు నుంచి దిగిపోవడమే. అంతకు మించి కమల్ నాధ్ కు మార్గం లేదన్నది సుస్పష్టం. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న సామెత కమల్ నాధ్ విషయంలో స్పష్టమయింది.

Tags:    

Similar News