అదే చేస్తే సెట్ అవుతుందా? డౌటే నట

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కలవరం చెందుతున్నారు. ప్రభుత్వం కూలిపోతుందన్న ఆందోళనలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యేలు జారిపోతున్నారని స్పష్టంగా కమల్ [more]

Update: 2020-03-10 18:29 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కలవరం చెందుతున్నారు. ప్రభుత్వం కూలిపోతుందన్న ఆందోళనలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యేలు జారిపోతున్నారని స్పష్టంగా కమల్ నాధ్ కు తెలుస్తోంది. పైగా పార్టీలో అంతర్గత సమస్యలు కూడా అసంతృప్తికి ఒక కారణంగా చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల సమయానికి ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారన్న ప్రచారం బాగా జరుగుతున్న నేపథ్యంలో కమల్ నాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నారు. కానీ ఈలోపే జరగరాని నష్టం జరిగిపోయింది.

మంత్రి వర్గ విస్తరణకు….

ఆయన మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాధ్ ప్రమాణస్వీకారం చేసి దాదాపు ఒకటన్నర సంవత్సరం గడుస్తుంది. ఆయన తో కలిపి కేబినెట్ లో మొత్తం 29 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం కల్పించే వీలుంది. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి పెట్టని కమల్ నాధ్ అసంతృప్తులను చల్లబర్చేందుకు ఆయన విస్తరణకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మంది జంప్ అయ్యారు.

కొత్త తలనొప్పులు…?

అయితే మంత్రివర్గ విస్తరణ వల్ల కొత్త తలనొప్పులు పుట్టుకొచ్చే అవకాశాలూ లేకపోలేదు. మధ్యప్రదేశ్ శాసనసభలో మొత్తం 230 స్థానాలున్నాయి. ఇందులో 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, స్వతంత్ర సభ్యుల మద్దతులో కమల్ నాధ్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు స్వతంత్ర సభ్యులతోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వీడే ప్రమాదముందని కమల్ నాధ్ గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.

హైకమాండ్ అవసరం లేదా?

ఇందుకోసం కమల్ నాధ్ అసంతృప్త ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడుతున్నారు. వారి వ్యక్తిగత సమస్యలతో పాటు నియోజకవర్గాల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అధిష్టానం సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తొలిగించేందుకు ప్రయత్నించడం లేదని కమల్ నాధ్ కొంత కినుకగా ఉన్నారు. అయితే హైకమాండ్ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు వస్తే ముఖ్యమంత్రి పదవి మార్పిడి విషయం కూడా చర్చకు వస్తుందని కమల్ నాధ్ కూడా హైకమండ్ జోక్యం ఉండకూడదనుకుంటున్నారు. చివరకు మంత్రి వర్గ విస్తరణ చేయకుండానే కమల్ నాధ్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది.

Tags:    

Similar News