ఆఖరి ప్రయత్నం… అయినా లాభం లేదే?

మధ్యప్రదేశ్ పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. బలపరీక్షకు కమల్ నాధ్ సిద్ధమయ్యారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటనేది ఈ [more]

Update: 2020-03-14 16:30 GMT

మధ్యప్రదేశ్ పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. బలపరీక్షకు కమల్ నాధ్ సిద్ధమయ్యారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటనేది ఈ నెల 16వ తేదీన తేలనుంది. 16వ తేదీన బలపరీక్షకు కమల్ నాధ్ సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే భోపాల్ చేరుకున్నారు. కమల్ నాధ్ మాత్రం ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్నారు. స్పీకర్ నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందని కమల్ నాధ్ భావిస్తున్నారు.

అనర్హత వేటు తప్పదా?

స్పీకర్ ప్రజాపతి ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. స్పీకర్ ప్రజాపతి ఈ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కమల్ నాధ్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. రాజీనామాలు ఆమోదించకుండా బలపరీక్ష కు దిగితే కాంగ్రెస్ విప్ జారీ చేస్తుంది. కమల్ నాధ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు గైర్హాజరయినా వారిపై అనర్హత వేటు పడుతుంది. దీంతో వారు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంది.

ఇబ్బంది పెట్టాలంటే?

ఈ ప్రక్రియ మరో ఏడాదికిపైగానే పట్టే అవకాశముంది. పార్టీకి ధోకా ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే బెటరన్న అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కమల్ నాధ్ ఆలోచన కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు చివరి నిమిషం వరకూ అన్ని ప్రయత్నాలూ కమల్ నాధ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు క్యాంపుల్లో ఉండటంతో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులను కొందరు కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక బృందాలు…..

అయితే రెబెల్ ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే బీజేపీ నుంచి గట్టి హామీ లభించింది. తమ గూటికి వచ్చిన వారిలో ఆరుగురు మంత్రులున్నారు. వారందరికీ తిరిగి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. అలాగే జ్యోతిరాదిత్య సింధియా సూచించిన వారికి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వనున్నారు. దీంతో సింధియా వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో రావడం కష్టమే అయినా ప్రత్యేక బృందాలను వీరికోసం కమల్ నాధ్ దించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆఖరి ప్రయత్నాలు కమల్ నాధ్ చేస్తున్నారు.

Tags:    

Similar News