సైరన్ మోగినట్టే.. ఇక సత్తా ఎవరిదో తేలిపోతుంది

ఎన్నికలు ఇక వచ్చేసినట్లే. మధ్యప్రదేశ్ లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా [more]

Update: 2020-09-10 17:30 GMT

ఎన్నికలు ఇక వచ్చేసినట్లే. మధ్యప్రదేశ్ లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 65 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని నిశ్చయించింది. అయితే ఇప్పుడు మిగిలిన శాసనసభ ఉప ఎన్నికల పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికి…..

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీత దాటడమే. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా అప్పటి ముఖ్యమంత్రి కమల్ నాధ్ ల మధ్య నెలకొన్న విభేదాలు ప్రభుత్వాన్ని కూల్చివేశాయని చెప్పాలి. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలు 19 మంది తో కలసి బీజేపీ పంచన చేరిపోయారు. జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. నేడో, రేపో కేంద్ర మంత్రి కానున్నారు. ఇక మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.

సింధియాపైనే అంతా….

దీంతో మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 27 శాససనసభ నియోజకవర్గాల్లో గెలుపోటములు అధికారం ఎవరిదన్నది నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింధియాకు సవాల్ గా మారనున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిపించకోకపోతే తిరిగి ప్రభుత్వం కాంగ్రెస్ పరమవుతోంది. బీజేపీ కూడా ఉప ఎన్నికల పూర్తి బాధ్యతను జ్యోతిరాదిత్య సింధియా మీదనే ఉంచింది.

కమల్ నాధ్ సత్తా తేలనుంది…..

మరోవైపు కమల్ నాధ్ సయితం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత కమల్ నాధ్ పైనే ఉంది. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ లు కలసి ఉప ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలన్నది కమల్ నాధ్ ఆలోచన. మరి కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియాల సత్తా మధ్యప్రదేశ్ లో ఈ ఎన్నికల ద్వారా తేలిపోనుంది.

Tags:    

Similar News