కింగ్ మేకర్ అవ్వాలనేనా?

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ దూకుడు పెంచారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కమల్ హాసన్ చర్యలు ప్రారంభించారు. [more]

Update: 2020-11-17 16:30 GMT

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ దూకుడు పెంచారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కమల్ హాసన్ చర్యలు ప్రారంభించారు. వరసగా నియోజకవర్గాల ఇన్ ఛార్జిలతో సమావేశమయ్యారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి విజయావకాశాలు ఉండే నియోజకవర్గాలను ముందుగా కమల్ హాసన్ గుర్తించే పనిలో పడ్డారు. అక్కడ బలమైన అభ్యర్థులను నిలబట్టే యోచనలో ఉన్నారు.

తృతీయ కూటమితో….

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి రెండేళ్లు కావస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి దెబ్బతిన్నారు. ఇక వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా ఒంటరిగా పోటీ చేసేందుకు కమల్ హాసన్ విముఖత చూపుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కు వ్యతిరేకంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది కమల్ హాసన్ లక్ష్యంగా ఉంది.

బీజేపీని వ్యతిరేకించే….

ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటీనీ కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. తమిళనాడులో చిన్నా చితక పార్టీలు కూడా కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రభావం చూపుతాయి. పీఎంకే, డీఎండీకే వంటి పార్టీలకు స్థిరమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ నేపథ్యలోనే కమల్ హాసన్ తృతీయ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. అటు ఇటు అయితే కింగ్ మేకర్ గా మారవచ్చన్నది కూడా కమల్ హాసన్ ఆలోచనగా ఉంది.

తొలుత పార్టీ పటిష్టత కోసం…….

అందుకే తొలుత తన పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు కమల్ హాసన్. రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తొలుత కమల్ హాసన్ భావించారు. అయితే రజనీ ఎటూ తేల్చకపోవడంతో ఇతర పార్టీలతో కలిపి కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఒకరి కొకరు అధికారంలోకి రాకుండా చివర వరకూ అడ్డుకుంటారు. కనీస స్థాయిలో తమ కూటమి సంపాదించగలిగితే ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుందన్నది కమల్ హాసన్ ఆలోచనగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News