మరోసారి టెన్షన్ తప్పేట్లు లేదే?

బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం. గత పార్లమెంటు ఎన్నికల్లో జరిగినట్లు రిజల్ట్ రిపీట్ అవుతుందనే సందేహం. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల [more]

Update: 2020-03-19 09:30 GMT

బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం. గత పార్లమెంటు ఎన్నికల్లో జరిగినట్లు రిజల్ట్ రిపీట్ అవుతుందనే సందేహం. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు. కవిత నామినేషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండటంతో కవిత విజయం సునాయాసమే. అయినా సరే ఎలాంటి తప్పులు జరగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు.

అందరూ అధికార పార్టీ వారైనా…..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు 2018 ఎన్నికల్లో ఒక్క స్థానం తప్ప అన్ని సెగ్మెంట్లలో విజయం లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సయితం టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ జిల్లాలో ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే లేకుండా పోయారు. అయినా ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సాక్షాత్తూ కల్వకుంట్ల కవితకు పరాభవం తప్పలేదు. అక్కడ బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ధర్మపురి అరవింద్ కు తరలిపోవడం వల్లనే కవిత ఓటమి పాలయ్యారన్న లెక్కలు అప్పట్లో విన్పించాయి.

వారిద్దరూ ఒకటైతే….

ఇప్పుడు కూడా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున కవిత, బీజేపీ తరుపున లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ కూడా బరిలో ఉంది. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతాయన్న అనుమానం అధికార పార్టీ నేతలకు నిద్ర కరువు చేసింది. స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లను వేయించే బాధ్యతను నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కేసీఆర్ ఎమ్మెల్యేలకు అప్పగించారు. అంతేకాదు పూర్తి బాధ్యతను మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ పెట్టారు. కవిత ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

బలం ఉన్నప్పటికీ….

నిజామాబాద్ జిల్లాలో మొత్తం840 ఓట్లకు పైగానే ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 540 ఓట్లు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందినవే కావడంతో కవిత ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా వాటి ఓట్ల సంఖ్య 300కు మించదు. అయినా తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఎక్కడ జారిపోతాయన్న టెన్షన్ ఉంది. అందుకోసమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైతే క్యాంపులకు తరలించాలని టీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎన్నికలో కవిత విజయం ఖాయం కావాలని కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఓటర్లను లెక్కలు వేసుకుని మరీ తామే పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News