జ‌గ‌న్ ఒకే ఒక నిర్ణయం: క‌ళా ఫ్యూచ‌ర్‌ మ‌రింత జీరో

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. ప్రత్యర్థుల‌ను క‌కావిక‌లం చేయాల‌నే ప్రధాన అజెండా ముందు ఏదైనా కార్యరూపం దాల్చొచ్చు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది ఏపీలో సీఎం జ‌గ‌న్ తీసుకున్న జిల్లాల [more]

Update: 2020-08-04 02:00 GMT

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. ప్రత్యర్థుల‌ను క‌కావిక‌లం చేయాల‌నే ప్రధాన అజెండా ముందు ఏదైనా కార్యరూపం దాల్చొచ్చు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది ఏపీలో సీఎం జ‌గ‌న్ తీసుకున్న జిల్లాల విభ‌జ‌న మంత్రం.. ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తుందా ? చేయ‌దా ? అనే విష‌యాన్ని ప‌క్కన పెడితే.. జిల్లాల్లో పాతుకుపోయిన కొంద‌రు కీల‌క నాయ‌కుల‌కు మాత్రం కేరాఫ్ లేకుండా చేయ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండు మూడు ద‌శాబ్దాలుగా జిల్లాల్లో తిష్టవేసి.. రాజ‌కీయాల‌ను, నేత‌ల‌ను, పార్టీల‌ను శాసించిన నాయ‌కులు త‌ర్వాత త‌ర్వాత తామే స‌ద‌రు జిల్లాలో రాజు మంత్రుల‌నే స్థాయికి ఎదిగారు.

తలరాతలు మారడం…..

అయితే, ఇప్పుడు సీఎం జ‌గ‌న్ తీసుకున్న జిల్లా విభ‌జ‌న లేదా కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇలాంటి నాయ‌కుల త‌ల‌రాత‌లు మారిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా జిల్లాల స్వరూపం మారిపోతుంది. ఈనేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు ఆయా జిల్లాల్లో చ‌క్రాలు తిప్పిన నాయ‌కుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారుతుంద‌ని అంటున్నారు. ఇదే ప‌రిస్థితి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు కూడా ఎదుర్కొంటున్నార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయ‌న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.

కళా ఆధిపత్యమే…

గ‌తంలో టీడీపీలో ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లొచ్చినా కూడా చంద్రబాబు ఆయ‌న‌కు 2014 ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వడంతో పాటు మంత్రిని చేసి.. ఆ త‌ర్వాత ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అప్పటి నుంచి ఆయ‌న శ్రీకాకుళం జిల్లాపై మాత్రం త‌న‌మార్కు రాజ‌కీయాలు ప్రద‌ర్శిస్తున్నారు. రాజాం, ఎచ్చెర్ర నియోజ‌క‌వర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. జిల్లాపై మాత్రం ప‌ట్టును నిలుపుకునే ప్రయ‌త్నం చేశారు. అటు జిల్లాలో గౌతు, గుండా, కింజార‌పు, క‌ల‌మ‌ట‌, కూన లాంటి బ‌ల‌మైన నేత‌లు ఉన్నా కూడా క‌ళా వెంకట్రావు ఆధిప‌త్యం ఉండేది.

విజయనగరం జిల్లాలో…..

అయితే, ఇప్పుడు క‌ళా వెంకట్రావు ప్రాతినిధ్యం వ‌హించిన ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. రాజాం నియోజ‌క‌వ‌ర్గం జిల్లాల విభ‌జ‌న‌లో వ‌చ్చి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌లుస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ వైసీపీ నుంచి బొత్స స‌త్యనారాయ‌ణ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇక టీడీపీలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు, బొబ్బిలి రాజులు బ‌ల‌మైన నేత‌లుగా ఉన్నారు. ఈ క్రమంలో క‌ళా వెంక‌ట్రావు త‌న దూకుడును ఎలా కొన‌సాగిస్తార‌నేది కీల‌క సందేహం.

ఇప్పటికే తగ్గుముఖం పట్టి…

విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి రాజులు ఇద్దరూ కూడా జిల్లాపై ప‌ట్టుసాధించేందుకు ప్రయ‌త్నిస్తే.. కొత్త రాజ‌కీయ ర‌గ‌డ‌ల‌కు శ్రీకారం చుట్టుకున్నట్టే అవుతుంద‌నేది వాస్తవం. వాస్తవానికి ఇప్పటికే క‌ళా వెంకట్రావు ప్రభావం త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిలో ఆయ‌న‌ది కూడా భాగం ఉంద‌నే ప్రచారం ఉంది. దీంతో ఆయ‌న‌ను పార్టీలో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా జిల్లా విభ‌జ‌న జ‌రిగితే.. క‌ళా వెంకట్రావు రాజ‌కీయ క‌ళ మరింత త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News