టాప్ లీడర్ టోపి పెట్టేశాడే?

తీవ్ర ఓట‌మి భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీలో మ‌ళ్లీ చాలా చోట్ల పెనుకుదుపు చోటు చేసుకునే అవకాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు. చాలా మంది [more]

Update: 2020-02-08 05:00 GMT

తీవ్ర ఓట‌మి భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీలో మ‌ళ్లీ చాలా చోట్ల పెనుకుదుపు చోటు చేసుకునే అవకాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు. చాలా మంది చంద్రబాబు మాటంటే లెక్కలేకుండా ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావుపై పార్టీలోనే ఓ వ‌ర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతేకాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెంక‌ట్రావు సొంత నియోజ‌క‌వ‌ర్గాలుగా పేరున్న ఎచ్చర్ల‌, రాజాం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. నిజానికి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు విజ‌య‌న‌గ‌రం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్నాయి.

వైసీపీ ఎంపీ అభ్యర్థికి…..

దీంతో విజ‌య‌న‌గ‌రం ఎంపీ గెలుపు గుర్రం ఎక్కాలంటే ఖ‌చ్చితంగా ఎచ్చర్ల, రాజాం నియోజ‌క‌వ‌ర్గాలు కీలకం. అయితే, గ‌త ఏడాది జరిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ క‌ళా వెంక‌ట్రావు క్యాస్ట్ పాలిటిక్స్‌కు తెర‌దీశార‌ని ప్రధానంగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. రాజాం, ఎచ్చర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల‌ను త‌న‌దైన శైలిలో త‌న‌వైపు తిప్పుకొన్నారు. ఈ క్రమంలోనే విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానం నుంచి వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన కాపు వ‌ర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖ‌ర్‌కు తెర‌చాటుగా క‌ళా వెంకట్రావు స‌హ‌కారం అందించార‌ని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు పోటీ చేశారు.

కుల రాజకీయాలకు….

అయితే, ఎప్పుడూ రాజుగారికే క‌దా మ‌నం ఎంపీ ఓటు వేస్తున్నాం.. కానీ, ఈ సారి మ‌నోడు.. మ‌న కుల‌పోడు బెల్లాన‌కు ఎంపీ ఓటు వేసి.. ఎమ్మెల్యే ఓటు మ‌న‌కేయండి-అని క‌ళా వెంకట్రావు తెర‌వెనుక చ‌క్రం తిప్పార‌ట కాపు నాయ‌కుల‌తో. దీంతో విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ నేత రాజుగారి ఫేట్ పులుసులో ప‌డిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో క‌ళా వెంకట్రావు చేసిన క్యాస్ట్ ఫీలింగ్ రాజ‌కీయాల‌తో చీపురుప‌ల్లి, ఎచ్చెర్ల, రాజాం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఓడిపోవ‌డంతో పాటు ఆ ప్రభావం ఎంపీపై ప‌డి అశోక్ కూడా ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న వైఖ‌రి మార్చుకోక‌పోవ‌డంతో పాటు కుల రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో అంత‌ర్గతంగా అంద‌రూ కూడా కళా వెంక‌ట్రావుపై నిప్పులు చెరుగుతున్నారు.

అచ్చెన్నాయుడుతో విభేదాలు…..

ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో ఇలా ఉంటే శ్రీకాకుళంలోనూ క‌ళా వెంకట్రావుకు ఎదురు గాలులు వీస్తున్నాయి. ఇక్కడ కీలక‌మైన నాయ‌కుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితో కిమిడి కళా వెంకట్రావుకి ఏమాత్రం పొస‌గ‌డం లేద‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే ఎర్రన్న ఫ్యామిలీతో క‌ళా వెంకట్రావుకు ఎప్పుడూ ప‌డ‌దు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న క‌ళా వెంకట్రావు చివ‌ర‌కు రాష్ట్రంలో పార్టీ ఏమైతే నాకేంటి అన్నది వ‌దిలేసి… నియోజ‌క‌వ‌ర్గ స్థాయి రాజ‌కీయాలు చేసుకుంటున్నార‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి. మొత్తానికి క‌ళా వెంకట్రావు క్యాస్ట్ పాలిటిక్స్ టీడీపీని నిండాముంచుతు న్నాయ‌ని అంటున్నారు.

Tags:    

Similar News