కిమిడి కుటుంబానికి గాలం ?

ఉత్తరాంధ్రా రాజకీయాల్లో కిమిడి కళా వెంకటరావు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆయన తమ్ముడు కిమిడి గణపతిరావు [more]

Update: 2020-12-12 00:30 GMT

ఉత్తరాంధ్రా రాజకీయాల్లో కిమిడి కళా వెంకటరావు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆయన తమ్ముడు కిమిడి గణపతిరావు అప్పట్లోనే ఎమ్మెల్యేగా చేశారు. మరదలు కిమిడి మృణాళిని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. 2014లో చీపురుపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఇక ఇపుడు వారి వారసుడు కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కానీ ఇపుడు విజయ‌నగరం పార్లమెంట్ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు.

బీజేపీ చూపు….

ఇక కిమిడి కళా వెంకటరావుని పొలిటి బ్యూరోలోకి తీసుకున్న చంద్రబాబు ఆయన కుమారుడు రాం మల్లిక్ నాయుడుని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇదిలా ఉంటే కిమిడి కుటుంబానికి చెందిన మరో కీలక నేత రామక్రిష్ణంనాయుడు టీడీపీ నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీ మెంబర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెరలో ఆయనకు గట్టి పట్టుంది. దాంతో ఆయన్ని బీజేపీలోకి తీసుకురావాలని ఆ పార్టీ గట్టిగా ట్రై చేస్తోంది. స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి బీజేపీ నేతలు చర్చలు జరిపారు. బీజేపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

దూకేస్తారా…?

టీడీపీలో ఇప్పటికే కిమిడి కుటుంబానికి కొంత ప్రాధాన్యత తగ్గింది. అచ్చెన్నాయుడు కుటుంబం హవా సిక్కోలు జిల్లా రాజకీయాల్లో కొనసాగుతోంది. దాంతో కళా వెంకటరావు సైలెంట్ అయ్యారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆయన తన మటుకు తాను వేరే పార్టీలోకి జంప్ చేయలేరు. దాంతో ఆయన కుటుంబంలో కొందరు బీజేపీకి వెళ్ళినా అభ్యంతరాలు ఉండబోవని అంటున్నారు. దాని వల్ల రేపటి రోజున బీజేపీ కి రాజకీయంగా మంచి జరిగినా కిమిడి కుటుంబానికి అక్కడ కూడా వాటా ఉంటుందన్న ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు.

ఆ వర్గం మీదనే…

ఉత్తరాంధ్రాలో చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని మచ్చిక చేసుకోవడానికి బీజేపీ ఎత్తులు వేస్తోంది. వారి అండ కనుక ఉంటే రాజకీయ సమీకరణలు కూడా మారిపోతాయని అంటున్నారు. వైసీపీకి, టీడీపీకి వీరి అండదండలు ఉండబట్టే విజయాలు వరిస్తున్నాయి. మరి బీజేపీ కూడా ఈ బలమైన సామాజికవర్గం వైపుగా మొగ్గు చూపుతోంది. రాజకీయంగా పెద్ద కుటుంబం అయిన కిమిడి ఫ్యామిలీని లాగేస్తే రెండు జిల్లాల మీద ఆ ప్రభావం ఉంటుందని లెక్కలు వేస్తోంది బీజేపీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News