టీడీపీలో ‘ క‌ళా ‘ త్మక ఇన్సింగ్‌కు శుభంకార్డు

క‌ళా వెంక‌ట‌రావు టీడీపీ ఆవిర్భవించిన‌ప్పటి నుంచి రాజ‌కీయాల్లో ఉన్న నేత‌… శ్రీకాకుళం జిల్లాలోని ఉణుకూరు కేంద్రంగా ద‌శాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఆయ‌న రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి [more]

Update: 2021-04-28 14:30 GMT

క‌ళా వెంక‌ట‌రావు టీడీపీ ఆవిర్భవించిన‌ప్పటి నుంచి రాజ‌కీయాల్లో ఉన్న నేత‌… శ్రీకాకుళం జిల్లాలోని ఉణుకూరు కేంద్రంగా ద‌శాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఆయ‌న రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ్యక్తి. టీడీపీలో వ‌రుస విజ‌యాలు సాధించిన ఆయ‌న ప‌లు కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా కూడా ఉన్నారు. మ‌ధ్యలో ఓ సారి రాజ్యస‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. అదే జిల్లాకు చెందిన దివంగ‌త కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడుతో ఉన్న విబేధాల నేప‌థ్యంలో 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లిన క‌ళా వెంక‌ట‌రావు తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు ఆ త‌ర్వాత చంద్రబాబు మంత్రి ప‌ద‌వితో పాటు ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్ష ప‌ద‌వి క‌ట్టబెట్టారు. అటు పార్టీ యువ‌నేత లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో క‌ళా వెంక‌ట‌రావు పార్టీ అధిష్టానం ద‌గ్గర అధికారంలో ఉన్నన్ని రోజులు మంచి ప‌ర‌ప‌తి సాధించుకున్నారు.

2019లో ఓట‌మితో సీన్ రివ‌ర్స్….

అటు మంత్రి… ఇటు ఏపీ టీడీపీ అధ్యక్ష హోదాలో ఉన్న క‌ళా వెంక‌ట‌రావు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్పటి నుంచి అధిష్టానం ద‌గ్గర క‌ళా ప‌ర‌ప‌తి త‌గ్గిపోతూ వ‌స్తోంది. చంద్రబాబు ఆయ‌న్ను పార్టీ అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించేయ‌డంతో పాటు ఆయ‌న‌కు జిల్లాలో రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఈ ప‌ద‌వి ఇవ్వడం క‌ళా వెంక‌ట‌రావుకు ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. ఇక క‌ళా అసంతృప్తి చెంద‌కుండా ఉండేందుకే ఆయ‌న త‌మ్ముడు కుమారుడు నాగార్జున‌కు విజ‌య‌న‌గ‌రం పార్లమెంట‌రీ పార్టీ జిల్లా పగ్గాలు ఇవ్వడంతో పాటు చీపురుప‌ల్లి పార్టీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చారు.

కొడుకు కు అవకాశమిచ్చినా…?

ఇటు క‌ళా వెంక‌ట‌రావు త‌న‌యుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుకు రాష్ట్ర కార్యదర్శిగా స్థానం దక్కింది. ఈ రెండు ప‌ద‌వుల విష‌యంలో క‌ళా లాబీయింగ్ ప‌నిచేసింద‌ని నిన్న మొన్నటి వ‌ర‌కు ప‌లువురు అనుకున్నా ఇప్పుడు క‌ళా వెంక‌ట‌రావును అధిష్టానం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం. ఆయ‌న అస‌మ్మతి రాగం వినిపించినా కుటుంబానికి న్యాయం చేశామ‌ని చెప్పేందుకే ఈ రెండు ప‌ద‌వులు ఇచ్చి అధిష్టానం చాలా జాగ్రత్తలు తీసుకుంద‌ని అంటున్నారు. ఇప్పటికే క‌ళా వెంక‌ట‌రావుకు ఎచ్చెర్లలో లోక‌ల్ సెగ ఎక్కువుగా ఉంది. ఇప్పుడు ఆయ‌న వార‌సుడి క‌న్నా చాలా మంది సీనియ‌ర్లు ఉన్నా … వారిని కాద‌ని వార‌సుడికి ప‌ద‌వి వ్వ‌డంతో తీవ్రమైన అస‌మ్మ‌తి ర‌గులుతోంది.

ఆయనను కాదని…..

ఇటు క‌ళా వెంక‌ట‌రావు త‌మ్ముడు త‌న‌యుడు నాగార్జున‌కు ఏకంగా పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడం కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లా నేత‌ల‌కు న‌చ్చడం లేదు. అటు క‌ళాకు వ్యతిరేకంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా నేత‌ల‌తో పాటు అచ్చెన్న కూడా ఒక్కటి అవుతోన్న ప‌రిణామాలు స్థానికంగా క‌నిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే క‌ళా వెంక‌ట‌రావును కాద‌ని ఎచ్చెర్లలో స్థానిక నేత‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తున్నారు. చివ‌ర‌కు క‌ళా త‌మ‌కు వ్యతిరేకంగా ఎవ‌రైనా ప‌నిచేస్తే వారి అంతు చూస్తాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే సీటు వ‌స్తుంద‌ని చెపుతున్నా కూడా ఎవ్వరూ లెక్కచేయ‌డం లేదు.

సోదరుడు బీజేపీలోకి…..

ఇక మ‌రోవైపు క‌ళా వెంక‌ట‌రావు మ‌రో సోద‌రుడు రామ‌కృష్ణ నాయుడు బీజేపీలోకి వెళ్లే ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. ఆయ‌న ఈ విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పేయ‌డంతో క‌ళాకు మ‌రో షాక్ అని చెప్పక త‌ప్పదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎచ్చెర్ల నుంచి క‌ళా వెంక‌ట‌రావును పూర్తిగా త‌ప్పించే ప్రయ‌త్నాలు అయితే గ‌ట్టిగానే జ‌రుగుతున్నాయి. ఇస్తే గిస్తే ఆ ఫ్యామిలీకి అది కూడా చీపురుప‌ల్లి సీటు త‌ప్పా మ‌రో సీటు ఇచ్చే ప్రసక్తే లేద‌ని పార్టీ వ‌ర్గాల్లోనే స్థానికంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌ల చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ క‌నీసం జిల్లా పార్టీ వ్యవ‌హారాల విష‌యంలో కూడా క‌ళా వెంక‌ట‌రావుతో చ‌ర్చించ‌డం లేద‌ని అంటున్నారు. ఏదేమైనా టీడీపీలో నాలుగు ద‌శాబ్దాల క‌ళాత్మక ఇన్సింగ్స్ ముగిసిన‌ట్టే సిగ్నల్స్ వ‌స్తున్నాయి.

Tags:    

Similar News