కాకాణికి అసలైన పరీక్ష ఇదేనా?

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇప్పుడు ఉప ఎన్నిక సవాల్ గా మారింది. గతంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంది ఒక ఎత్తు. పదిహేను నెలల పాటు [more]

Update: 2020-10-01 15:30 GMT

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇప్పుడు ఉప ఎన్నిక సవాల్ గా మారింది. గతంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంది ఒక ఎత్తు. పదిహేను నెలల పాటు అధికారంలో ఉన్నది మరో ఎత్తు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాకాణి గోవర్థన్ రెడ్డిపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత దెబ్బతీస్తోందేమోనన్న ఆందోళన కూడా ఆయన వర్గంలో లేకపోలేదు.

జిల్లా అధ్యక్షుడిగా…..

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కాకాణి గోవర్థన్ రెడ్డి కేవలం సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమే కాదు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలున్నాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు ఉన్నాయి.

సమన్వయం చేసుకుని…..

ఈ నాలుగు నియోజకవర్గాల నేతలను సమన్వయం చేసుకుని వెళ్లాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డి పైనే ఉంది. ప్రస్తుతం కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మంచి మిత్రులుగా ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలు వీరిద్దరీని ఏకం చేశారని చెప్పాలి. ఇక గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాకాణి గీసిన గీత దాటే అవకాశం లేదు. దీంతో వీరందరినీ వైసీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత కాకాణి గోవర్థన్ రెడ్డిపైనే ఉంది.

మంత్రి పదవి కోసం…..

కాకాణి గోవర్థన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. రెండుసార్లు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఓడించారు. తొలి నుంచి వైసీపీని నమ్ముకుని ఉన్నారు. ఆయన మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నారు.మరో ఏడాదిన్నర తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని కాకాణి గోవర్థన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ ను బట్టి కాకాణి గోవర్థన్ రెడ్డి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో కాకాణి గోవర్థన్ రెడ్డి ఎలా పార్టీకి ఓట్లు తెచ్చిపెడతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News