కాకాణి పేరు ఖరరాయిందటగా?

కాకాణి గోవర్థన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రమిస్తున్న కాకాణి గోవర్థన్ రెడ్డికి భవిష్యత్తులో ఏ పదవైనా వస్తుందా? ఇంత పోటీ ఉన్న [more]

Update: 2020-08-12 06:30 GMT

కాకాణి గోవర్థన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రమిస్తున్న కాకాణి గోవర్థన్ రెడ్డికి భవిష్యత్తులో ఏ పదవైనా వస్తుందా? ఇంత పోటీ ఉన్న తరుణంలో కాకాణిని జగన్ చేరదీస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాకాణి గోవర్థన్ రెడ్డికి ఒక పదవిని జగన్ రెడీ చేసిపట్టారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. నిజానికి కాకాణికి తొలి మంత్రి వర్గ విస్తరణలోనే పదవి దక్కాల్సి ఉన్నా సామాజికవర్గం సమీకరణల్లో భాగంగా జగన్ ఇవ్వలేకపోయారు.

పార్టీ ఆవిర్భావం నుంచి….

కాకాణి గోవర్థన్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో కూడా కాకాణి గోవర్థన్ రెడ్డి శ్రమ ఉందని కాదనలేని వాస్తవం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీతో పోరాటం చేసిన వారిలో కాకాణి గోవర్థన్ రెడ్డి ఒకరు. అప్పట్లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఒంటరిపోరాటం చేశారనే చెప్పుకోవాలి.

మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నా…..

కానీ తీరా అధికారంలోకి వచ్చాక జగన్ ముందే మేకపాటి కుటుంబానికి ప్రామిస్ చేసి ఉండటంతో వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత వస్తుందనుకున్నా నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకాణికి మరో దఫా విస్తరణలోనూ మంత్రి పదవి దక్కడం అనుమానమేనంటున్నారు.

ఈ పదవికి ఖరారు…..

అందుకే కాకాణి గోవర్థన్ రెడ్డిని ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. గుంటూరు జోన్ ఛైర్మన్ పదవి కాకాణి గోవర్థన్ రెడ్డికి గ్యారంటీ అంటున్నారు. గుటూరు ప్రాంతీయ అభివృద్ధి మండలిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండటంతో కాకాణి గోవర్థన్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు, కేబినెట్ ర్యాంకు కావడంతో కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారంటున్నారు. మరి చివరి నిమిషంలో మరో పేరు రాకుంటే కాకాణి పేరు ఈ పదవికి ఖరారయినట్లేనంటున్నారు.

Tags:    

Similar News