అప్పటి వరకూ ఎందుకంటే? ఇందుకే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా నిర్ణయం వస్తే కఠినంగా నిలబడతారు. ఎటువంటి సందేహాలకు ఆయన అవకాశమివ్వరు. ఉద్యమకారుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ [more]

Update: 2020-04-24 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా నిర్ణయం వస్తే కఠినంగా నిలబడతారు. ఎటువంటి సందేహాలకు ఆయన అవకాశమివ్వరు. ఉద్యమకారుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకూ పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తే, కేసీఆర్ మరో నాలుగు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మంత్రి వర్గ సమావేశం అంటే మమ అనిపించడమే. ముందుగానే కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ప్రగతి భవన్ లో ఉండి జిల్లాల్లో ఉన్న తన పార్టీ నేతలకు ఫోన్లు చేసి ప్రజల నాడిని తెలుసుకున్నారు.

మే 7వ తేదీ వరకూ…..

లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకూ పొడిగించడానికి కారణాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో క్వారంటైన్ గడువు 14 రోజులు ముగిసింది. మరో 14 రోజులు కొన్ని కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో క్వారంటైన్ ను కంటెయిన్ చేయాల్సి ఉంది. ఈ గడువు మే ఏడో తేదీకి ముగుస్తుండటంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి వరకూ లాక్ డౌన్ ను విధించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

రంజాన్ మాసం కూడా…..

అలాగే మరో నాలుగు రోజుల్లో రంజాన్ మాసం ప్రవేశిస్తుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా హైదరాబాద్ లోనే ఉంది. రంజాన్ మాసంలో లాక్ డౌన్ ను సడలిస్తే ప్రార్థనలకు ముస్లింలు మసీదులకు వచ్చే అవకాశముంది. సామూహిక ప్రార్థనలకు దిగే అవకాశముంది. ఈ కారణంగా వైరస్ వ్యాప్తి చెందకూడదనే కేసీఆర్ లాక్ డౌన్ ను మరింత పొడిగించారంటున్నారు.

మొదటి వారంలో కేసులు…..

మరోవైపు మే 1వ తేదీ నాటికి వైరస్ వ్యాప్తిపై స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన కేసులు ఇక లేవు. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ప్రస్తుతం ఎక్కువగా వ్యాధి బారిన పడ్డారు. మరో పది రోజుల్లో వీరి కాంటాక్ట్ లను ట్రేస్ చేసి కట్టడి చేయగలితే వ్యాధి నియంత్రణలోకి వస్తుందని కేసీఆర్ భావించారు. అధికారులు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మే మొదటి వారంలో వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశముందని భావించి మే 7వ తేదీ వరకూ తెలంగాణలో కేసీఆర్ లాక్ డౌన్ ను విధించారు.

Tags:    

Similar News