ఇంతకీ అభ్యర్థి ఎవరు?

అధికార పార్టీకి అభ్యర్థి కరువయ్యారా? అవును ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. [more]

Update: 2020-12-28 11:00 GMT

అధికార పార్టీకి అభ్యర్థి కరువయ్యారా? అవును ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. నాగార్జున సాగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే నోముల నరసింహయ్య కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. నోముల నరసింహయ్యకు ప్రజల్లో ఉన్న పట్టు వారి కుటుంబ సభ్యులకు లేకపోవడమే ఇందుకు కారణం.

సానుభూతి పనిచేయదా?

దుబ్బాక ఉప ఎన్నికలో సానుభూతి పనిచేయలేదు. అలాగే నాగార్జున సాగర్ లో కూడా సానుభూతి పనిచేస్తుందన్న నమ్మకం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా మరో నేత కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. నోముల నరసింహయ్య కుటుంబం నుంచి కూడా పెద్దగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేనందున వారికి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. అదే సామాజికవర్గానికి ఇవ్వాలా? అన్న దానిపై కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు.

మరొక సామాజికవర్గానికి….

మరొక సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయిస్తే వీరంతా వ్యతిరేకమయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ తరుపున బలమైన నేత జానారెడ్డి కుటుంబం బరిలో ఉండటంతో ఆయనను ఎదుర్కొనే నేతను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జానారెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో రెండు నుంచి మూడ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.

సర్వే తర్వాతనే…..

కానీ వీరిలో ఎవరు సరైన అభ్యర్థి అవుతారన్నది సర్వే నివేదికలు అందిన తర్వాతనే నిర్ణయిస్తారని తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం రెండు, మూడు సార్లు సర్వే చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సర్వేలో ఎవరికి ప్రజల మద్దతు ఉందని తెలిస్తే వారికే టిక్కెట్ దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీలో నాగార్జు సాగర్ అభ్యర్థి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News