యాక్షన్ ప్లాన్ తలకిందులు చేసేసిందా?

కేసీఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన ఒక్కో అడుగు వేసిన తీరు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన విధానం చూస్తే ఆయన చాణక్యం ఏంటి అన్నది అర్ధమవుతుంది. ఇక కేసీఆర్ [more]

Update: 2020-05-03 00:30 GMT

కేసీఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన ఒక్కో అడుగు వేసిన తీరు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన విధానం చూస్తే ఆయన చాణక్యం ఏంటి అన్నది అర్ధమవుతుంది. ఇక కేసీఆర్ మొదటి టెర్మ్ ఆరు నెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేశారు. అన్ని వైపుల నుంచి సానుకూలతను చొసుకుని మరీ బరిలోకి దిగిన కేసీఆర్ బంపర్ మెజారిటీతో రెండవమారు అధికారంలోకి వచ్చారు. ఇక ఈసారి అధికారం కొడుకు కోసమే అని ప్రచారం జరిగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, ఫెడరల్ ఫ్రంట్ కట్టి తన స్థాయికి తగినట్లుగా ఉప ప్రధాని అయినా అవుతారని కూడా టీఆర్ఎస్ అప్పట్లో లెక్కలేసింది. అయితే భారీ ఆధిక్యతతో కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చారు. దాంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సివచ్చింది.

అదిగో అలా….

ఇక కేసీఆర్ తరువాత కేటీయారేనని అంతా అనుకుంటూ వచ్చారు. అదిగో ఇదిగో ముహూర్తం అని కూడా చెప్పుకొచ్చారు. అయితే రెండవ మారు కేసీఆర్ సీఎం అయ్యాక కేంద్రంలోని బీజేపీతో సంబంధాలు దెబ్బ తిన్నాయి. పైగా కేసీఆర్ కొన్ని పధకాలు ప్రజలకు హామీ ఇచ్చారు. అవన్నీ పూర్తి చేసి రాజకీయంగా పరిస్థితి చక్కబడ్డాక కొడుకు చేతికి అధికారం ఇవ్వాలనుకున్నారని టాక్. దానికి తెర వెనక కసరత్తు జరుగుతోంది. ఓ వైపు భారీ నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఇక ఆర్ధికంగా నిబ్బరంగా ఉండొచ్చు ఫరవాలేదు అనుకుంటున్న వేళ కరోనా రక్కసి వచ్చింది. దాంతో సీన్ మళ్ళీ మొదటికి వచ్చింది.

కుదేల్ అయ్యారా…?

సంపన్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణా కూడా లాక్ డౌన్ ల పుణ్యమాని ఆర్ధికంగా కుదేల్ అయ్యేలా సీన్ కనిపిస్తోంది. రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి. మరో వైపు చూసుకుంటే రాజకీయంగా మళ్ళీ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేంద్రంతో మళ్ళీ మంచి చేసుకునేలా కేసీఆర్ తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరో వైపు తెలంగాణాను సాధారణ స్థితికి తేవాలంటే అది ఒక్క కేసీఆర్ వల్లనే సాధ్యం అన్న మాట కూడా టీఆర్ఎస్ లో ఉంది.

మూడుతోనే……

కేసీఆర్ ఈ సమయంలో తప్పుకుంటే కొడుకు కేటీయార్ని తెచ్చి పెడితే ఇబ్బడి ముబ్బడి సమస్యలతో విఫల పాలకుడిగా నిలిచిపోతారు. పైగా విపక్ష రాజకీయ పార్టీలు కూడా రెచ్చిపోయి టార్గెట్ చేస్తాయి. ఈ నేపధ్యంలో కేసీఆర్ మరో మూడున్నరేళ్ళ పాటు ఉన్న అధికారానికి తానే సీఎంగా కొనసాగనున్నరని టాక్. ఎటూ తెలంగాణా సాధారణ పరిస్థితికి వచ్చేటప్పటికి 2023లో తెలంగాణాఎన్నికలు వచ్చేస్తాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను చూసుకుని కేసీఆర్ తెలంగాణాను కొడుకు చేతిల్లో పెడతారని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ కి ఎటువంటి మార్పూ లేకుండా కేసీఆరే సీఎంగా కొనసాగుతారు. మొత్తానికి కరోనా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ని ఒక్కసారిగా తల్లకిందులు చేసేసింది అని చెప్పాలి.
.

Tags:    

Similar News