Kcr : మరోసారి దానినే నమ్ముకుంటున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై ఇక మాటల దాడికి దిగేటట్లే కన్పిస్తుంది. సెంటిమెంట్ తెలంగాణలో మరింత బలపడాలంటే కేసీఆర్ కు అంతకు మించి [more]

Update: 2021-11-07 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై ఇక మాటల దాడికి దిగేటట్లే కన్పిస్తుంది. సెంటిమెంట్ తెలంగాణలో మరింత బలపడాలంటే కేసీఆర్ కు అంతకు మించి మార్గం లేదు. జగన్ ను రెచ్చగొడితేనే కొంత అనుకూలంగా రాజకీయ వాతావరణం మారుతుందన్న లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్లు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ తో తగవులు ఎప్పుడూ కేసీఆర్ కు అనుకూలంగా మారతాయి.

ప్లీనరీ నుంచే….

అందుకే కేసీఆర్ ప్లీనరీ నుంచే జగన్ పార్టీపై విమర్శలను ప్రారంభించారు. ఏపీ తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనకబడి ఉందని పదే పదే చెప్పారు. ఇటు విద్యుత్తు, అటు పారిశ్రామికీకరణలో ఏపీ వెనకబాటుతనాన్ని ప్రశ్నించి జగన్ తో కయ్యానికే సిద్ధమయ్యారు. ఎన్నికలకు సమయం ఇంకా రెండేళ్లు మాత్రమే ఉండటంతో ఏపీతో వైరం తనకు కలసి వస్తుందని కేసీఆర్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు అనుకోని రీతిలో కేసీఆర్ కు వరంగా మారారు.

సెంటిమెంట్ జోడైతే…

ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలోనూ ఆయన న్యాయపోరాటానికే దిగారు. అంతే కాదు జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సంక్షేమంతో పాటు సెంటిమెంట్ జోడైతే ఎక్కువ స్థానాలను సాధించవచ్చన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఇక కేసీఆర్ టార్గెట్ జగనే అవుతారన్న వాదన విన్పిస్తుంది.

సరిహద్దు రాష్ట్రాల్లో….

వచ్చే ఎన్నికల్లో ఏపీ సరిహద్దు రాష్ట్రాలైన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ సెంటిమెంట్ పనిచేస్తేనే ఎక్కువ స్థానాలను సాధించే అవకాశముంటుంది. కాంగ్రెస్ పెద్దగా బలంగా లేకపోయినా, బీజేపీ మరోవైపు దూసుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ నే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే రానున్న కాలంలో కేసీఆర్ ఏపీ ప్రభుత్వం, జగన్ పైన ఊహించని వ్యాఖ్యలు చేస్తారని కూడా అంచనాలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News