తిరుగులేని చంద్రుడు

తెలంగాణాలో ఇప్పట్లో గులాబీ దండుకు తిరుగులేదని మున్సిపోల్స్ విజయం చాటింది. రెండోసారి కారు పార్టీ అధికారంలోకి వచ్చాకా తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అన్ని [more]

Update: 2020-01-26 11:00 GMT

తెలంగాణాలో ఇప్పట్లో గులాబీ దండుకు తిరుగులేదని మున్సిపోల్స్ విజయం చాటింది. రెండోసారి కారు పార్టీ అధికారంలోకి వచ్చాకా తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అన్ని రాజకీయ పక్షాలు ఒక్కటై అధికార పక్షంపై అలుపెరగని పోరాటమే సాగించాయి. దీన్ని అత్యంత వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మార్చుకుని విపక్షాల ఆశలపై నీళ్ళు చల్లారు గులాబీ అధినేత కేసీఆర్. తెలంగాణ తెచ్చింది తాము అని జబ్బలు చరుచుకున్న కాంగ్రెస్, ఒకే దేశం ఒకే పార్టీ అంటూ మతం అంశాన్నే ప్రధాన అంశం చేసుకుని తామే అసలు ప్రత్యామ్నాయం గా ప్రకటించుకున్న కమలం ఫలితాల తరువాత కారు జోరుకు బొక్కబోర్లా పడిపోయాయి. అంతే కాదు సమీప భవిష్యత్తులో గులాబీ హవాకు ఎదురు నిలిచే సత్తా వారికి లేదనే వాస్తవాన్ని ప్రజల ముందు ఆవిష్కరించాయి.

తిరుగులేని శక్తిగా …

రాజకీయ వ్యూహాలు రచించడం వాటిని పక్కాగా అమలు చేయడంలో కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. అతి తక్కువ సందర్భాల్లోనే ఆయన రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టాయి. భారీ బహిరంగ సభలు లేకుండా, ముఖ్యమంత్రి ప్రచారం సైతం చేయకుండానే కేసీఆర్ అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపు వెనుక అనేక కారణాలే కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఇంటిటింటికి క్యాడర్ ద్వారా చేరవేయడం ఒక పాయింట్. అలాగే పూర్తిగా స్థానిక నాయకత్వానికి గెలుపు బాధ్యతలను అప్పగించి వారిపై పూర్తి విశ్వాసాన్ని పెట్టింది అధిష్టానం. గెలుపు గుర్రాలను గుర్తించి టికెట్లు ఇవ్వడంలో కూడా స్థానిక నాయకత్వాలు సక్సెస్ అయ్యాయి.

వారు అక్కడ సక్సెస్ …

దీనికి తోడు సాగునీటి ప్రాజెక్ట్ లు, సంక్షేమ పథకాలు గులాబీ పార్టీకి దీవెనల అంశంలో బాగా దోహదపడ్డాయి. మునిసిపల్ ఎన్నికలకు కేసీఆర్ పక్కాగా సిద్ధం అయ్యారు. విపక్షాలు మాత్రం ఆధిపత్యం కోసం టికెట్ల కోసం కొట్లాటల తో సమయం సరిపోయింది. అదేవిధంగా అటు కాంగ్రెస్ కి కానీ, బిజెపికి కానీ తమదైన వ్యూహాలు లేకపోవడం తో పాటు వారు గెలిచినా తమ ప్రాంతానికి నష్టమే తప్ప లాభం లేదన్న ప్రజల అనుమానం కొంప ముంచాయి అని తేలింది. నిత్యం అధికారపక్షాన్ని విమర్శలు చేయడం తప్ప తాము చేయబోయే కార్యక్రమాలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైఫల్యం కూడా పరాజయానికి కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News