ఈసారి కేసీఆర్ కు హర్రర్ మూవీయేనట

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. సీట్ల సర్దుబాటు [more]

Update: 2021-08-04 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారనుంది. నియోకవర్గాల పెంపు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ పార్టీకి ఒక్కో చోట ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడే అవకాశముంది.

కాంగ్రెస్, టీడీపీలను….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు ప్రధాన అడ్డంకిగా మారుతుందని భావించిన కాంగ్రెస్, టీడీపీ లను తన పార్టీలో కలిపేసుకునేందుకే కేసీఆర్ ఎక్కువగా ప్రయత్నించారు. మొదటి దఫా, రెండో దఫాల్లోనూ కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ శాసనసభ పక్షాన్ని ఏకంగా తన పార్టీలో కలిపేసుకుని అసెంబ్లీలో ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేశారు.

సీట్ల సంఖ్య పెరుగుతుందని…

ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చినా తనకు భవిష్యత్ లో ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావించారు. ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాల నుంచి 153 నియోజకవర్గాలకు సంఖ్య పెరుగుతుండటంతో ఇతర పార్టీల నుంచి తనపై నమ్మకంతో వచ్చిన నేతలకు సర్దుబాటు చేయవచ్చని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని చెప్పడంతో వచ్చే ఎన్నికలలో సీట్ల పంపిణీ కేసీఆర్ కు చుక్కలు చూపించక మానదు.

యాభై నుంచి అరవై….

ఇప్పటికే దాదాపు యాభై నుంచి అరవై నియోజకవర్గాలలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంపీలు సయితం శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో తొలి నుంచి కష్టపడిన నేతలున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో కలపి ఒక నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. 2018 ఎన్నికల్లోనే సీట్ల సర్దుబాబు కేసీఆర్ కు కష్టమయింది. సీటు దక్కని వాళ్లు వెయిట్ చేసే ఛాన్సే లేదు. వేరే పార్టీకి వెళ్లి పోట ీచేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి మరింత ఇబ్బంది ఎదురుకానుందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News