అలజడి మొదలయింది.. జంప్ లు స్టార్టవుతాయా?

తెలంగాణలో అధికార పార్టీలో అలజడి మొదలయింది. ఇప్పటి వరకూ చేరికలతోనే జోష్ లో ఉన్న గులాబీ పార్టీ నుంచి ఇక వలసలు తప్పవంటున్నారు. ఉద్యమ కాలం నుంచి [more]

Update: 2021-01-03 09:30 GMT

తెలంగాణలో అధికార పార్టీలో అలజడి మొదలయింది. ఇప్పటి వరకూ చేరికలతోనే జోష్ లో ఉన్న గులాబీ పార్టీ నుంచి ఇక వలసలు తప్పవంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నవారు, తర్వాత వచ్చి చేరిన వారితో టీఆర్ఎస్ లో ఇప్పటికే రెండు గ్రూపులున్నాయి. వీరిలో అనేక మందికి పదవులు దక్కలేదు. అధికారంలో ఉండటంతో ఇన్నాళ్లూ పదవులు దక్కకపోయినా మౌనంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ చూసుకునేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు.

రెండు సార్లు అధికారంలోకి……

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. వారిలో కొందరికి మంత్రిపదవులు కూడా అప్పట్లో ఇచ్చారు. మళ్ల ీరెండోసారి అధికారం వచ్చింది. అయితే ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ఏ పదవులు దక్కలేదు. నామినేటెడ్ పోస్టులను కూడా కేసీఆర్ భర్తీ చేయలేదు. దీంతో అనేక మందిలో అసంతృప్తి నెలకొంది.

అసంతప్తిగా ఉన్న నేతలను…..

అలాగే రెండోసారి మంత్రి పదవులపై కూడా అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకూ మంత్రివర్గవిస్తరణను కేసీఆర్ చేయలేదు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు సయితం అసంతృప్తిలో ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నేతలను కూడా కేసీఆర్ గత కొంతకాలంగా పక్కన పెట్టారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలను పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. దీంతో వీరు కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.

మంతనాలు షురూ…..

బీజేపీ అన్ని ప్రాంతాల్లో బలం పెంచుకునేందుకు మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొందరితో మంతనాలుకూడా చేశారని చెబుతున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుంచి కొందరు ముఖ్యనేతలు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. మరి ఈ వలసలను కేసీఆర్ ఎలా ఆపగలుగుతారో చూడాలి. అందుకే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Tags:    

Similar News