kcr : ఏపీలో పోటీ… జగన్ కు మేలు చేయడానికేనా?

ఊరికే అనరు మహానుభావులు అన్న సామెత ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ [more]

Update: 2021-10-26 00:30 GMT

ఊరికే అనరు మహానుభావులు అన్న సామెత ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ ను పెట్టాలని తనపై వత్తిడి వస్తుందని, ఏపీలో ఉన్న తన అభిమానులు కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. ఇందులో నిజానిజాలపై ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు సీరియస్ గా చేశారా? లేక పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి చేశారా? అన్నద చర్చనీయాంశంగా మారింది.

సఖ్యతగానే….

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటున్నారు. తిరుమల వెంకటేశ్వరుడికి తన మొక్కును చెల్లించుకున్నారు. అలాగే విశాఖ వెళ్లి శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ హాజరయ్యారు. గత ఎన్నికల్లో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ పరోక్ష సహకారం చేశారని ఇప్పటికీ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. జగన్ మీద కేసీఆర్ కు సదభిప్రాయం ఉంది. చంద్రబాబు తన రాష్ట్రంలో వేలు పెడతారన్న ఆగ్రహమూ ఉంది.

దళితబంధు ప్రస్తావనతో…

అందుకే కేసీఆర్ ఎప్పుడూ జగన్ ను బహిరంగంగా విమర్శించలేదు. అదే చంద్రబాబును తిట్టిపోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలన్న దానిపై వైసీపీలోనూ చర్చ జరుగుతుంది. దళిత బంధు పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని, అక్కడ టీఆర్ఎస్ పార్టీని పెడితే తాము గెలిపించుకుంటామని అంటున్నారని కేసీఆర్ అన్నారు.

డైవర్ట్ చేయడానికేనా?

అయితే ఇందులో దళిత బంధు పథకాన్ని జగన్ మెడకు చుట్టాలన్న ఆలోచన కూడా కేసీఆర్ కు లేకపోలేదంటున్నారు. అదే సమయంలో జగన్ తెలంగాణలో వైసీపీని పూర్తిగా మూసివేశారు. ఏపీలో రాజకీయంగా విపక్షాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో జగన్ ను సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. కేసీఆర్ మాత్రం జగన్ ను దూరం చేసుకుని, చంద్రబాబు దగ్గరకు దరి చేరరు. కానీ ఈ కామెంట్స్ జగన్ కు అనుకూలంగా చేసినవా? వ్యతిరేకంగా చేసినవా? అన్న చర్చ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో జరుగుతుంది.

Tags:    

Similar News