కేసీఆర్ కూడా రాజధాని మార్చేశారు ?

ఏపీలో మూడు రాజధానుల ముచ్చట ఓ వైపు సాగుతోంది. అమరావతితో పాటు మరో రెండు అని వైసీపీ అంటూంటే, కాదు అమరావతే మన ఏకైక‌ రాజధాని కావాలి [more]

Update: 2020-07-08 11:00 GMT

ఏపీలో మూడు రాజధానుల ముచ్చట ఓ వైపు సాగుతోంది. అమరావతితో పాటు మరో రెండు అని వైసీపీ అంటూంటే, కాదు అమరావతే మన ఏకైక‌ రాజధాని కావాలి అని టీడీపీ వాదిస్తోంది. ఆ పార్టీకి మిగిలిన పార్టీలు కూడా మద్దతుగా నిలబడుతున్నాయి. దాంతో ఆరు నెలలుగా రాజధాని రాజకీయం ఏపీని హీటెక్కించేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాకు బంగారం లాంటి రాజధాని ఉంది. అది భాగ్యనగరం, కోటి మంది జనాభాతో ఒక మినీ దేశంగా ఉన్న హైదరాబాద్ నుంచి మహారాజులా కేసీఆర్ పాలించేవారు. అటువంటి కేసీఆర్ కి ఇపుడు హైదరాబాద్ అసలు నచ్చడంలేదుట.

ఎందుకిలా….?

హైదారాబాద్ దేశానికే దిక్కు అని, రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిలిచి గెలిచే సత్తా ఉన్న నగరమని చెప్పే కేసీఆర్ ఇపుడు అంతటి రాజసం ఉన్న రాజధానిని వదిలి ఎందుకు వేరేది కావాలనుకుంటున్నారు. ఆయన ఎందుకు హైదరాబాద్ కి దూరం అవుతున్నారు అంటే. అది తెలిసిన కధే హైదరాబాద్ లో కరోనా మహమ్మారిలా విరుచుకుపడుతోంది. కేసులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దాంతో భాగ్యనగ‌రం బ్లాస్ట్ అవుతుందా అనేంతలా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో గత వారం రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఉంటున్నారు. ఏకంగా ప్రగతిభవన్ కే కరోనా మహమ్మారి చుట్టుకోవడంతో కేసీఆర్ ఫాం హౌస్ వదలిరావడంలేదు.

అక్కడే అన్నీ….

ఇక కేసీఆర్ పాలన కూడా అక్కడ నుంచే చేయాలని నిర్ణయించుకున్నారుట. కరోనా మహమ్మారి తగ్గేంతవరకూ కేసీఆర్ ఎర్రవల్లి విడిచి రాకూడదని నిర్ణయించుకున్నారుట. అక్కడ సురక్షిత స్థావరం అని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక అక్కడ నుంచే వీడియో సమావేశాల ద్వారా రాష్ట్రంలో కేసీఆర్ పాలన చక్కబెడతారుట. అత్యాధునిక సాంకేతిక సంపత్తితో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ ని అధికారులు తీర్చిదిద్దారుట. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ అక్కడ నుంచే మంత్రులు అధికారులను అలెర్ట్ చేస్తూ తనదైన పాలన సాగిస్తారని టాక్.

నో ఛాన్స్ …..

ఇక కేసీఆర్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఉంటున్నారు. ఆయన్ని ఎవరూ నేరుగా కలసే వీలు లేదు. ఇక మంత్రులు అధికారులు ఎవరూ కూడా అయన్ని డైరెక్టుగా కలిసేందుకు రావద్దని కచ్చితమైన ఆదేశాలు కూడా వెలువడ్డాయని టాక్. మొత్తానికి కేసీఆర్ కొన్నాళ్ళ పాటు హైదరాబాద్ ని మరచిపోవాలనుకుంటున్నారుట. ఎర్రవల్లిలోని తమ ఫాం హౌసే వేదికగా పాలన చేయాలనుకుంటున్నారుట. గతంలో జగన్ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నట్లుగా ఎర్రవల్లికి రాజధాని కళ వచ్చేసిందిట. దీని మీద విపక్షాలు గోల చేస్తున్నాయి. కేసీఆర్ ఫాం హౌస్ వీడి రావాలని కూడా కోరుతున్నాయి. అయితే తాను ఎక్కడ నుంచి అయినా పాలన చేస్తానని కేసీఆర్ అంటున్నారుట. సో మొత్తానికి ప్రస్తుతానికి ఎర్రవల్లి తెలంగాణాకు కొత్త రాజధాని. అది అంతే.

Tags:    

Similar News