జగన్ కంటే బాబే బెటరా ?

అన్నదమ్ములంటే వీళ్ళే అన్న భావన కొన్నాళ్ళు ఉమ్మడి ఏపీ జనాల్లో ఏర్పడింది. నిజానికి జగన్ ఏపీకి ప్రతిపక్ష నాయకుడుగా కాక ముందు నుంచే టీఆర్ఎస్ తో సన్నిహిత [more]

Update: 2020-08-16 13:30 GMT

అన్నదమ్ములంటే వీళ్ళే అన్న భావన కొన్నాళ్ళు ఉమ్మడి ఏపీ జనాల్లో ఏర్పడింది. నిజానికి జగన్ ఏపీకి ప్రతిపక్ష నాయకుడుగా కాక ముందు నుంచే టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని అంటారు. ఇక 2014 ఎన్నికల వేళ ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీఆర్ ఇది పక్కా నిజం అంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహారెడ్డి టీవీ డిబేట్లలో బల్లగుద్దారు. నాడు అనేక మంది టీఆర్ఎస్ నేతలు కూడా బాబు వద్దు, జగనే ముద్దు అన్నట్లుగా మాట్లాడారు, కానీ బాబు వచ్చారు. అయిదేళ్ల పాటు ఉప్పూ నిప్పు మాదిరిగా ఏపీ తెలంగాణాల మధ్య రాజకీయ కధ నడిచింది.

కోరి మరీ ….

ఏపీలో జగన్ రావాలని ఆయన కంటే ఎక్కువగా తప‌స్సు చేసింది టీఆర్ఎస్. చంద్రబాబు సీనియర్ నేత అని, పైగా ఆయన వద్ద తాను మంత్రిగా పనిచేశారని కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో కేసీఆర్ లో ఉన్నట్లుందేమో. జగన్ ఏపీ సీఎం అయితే పక్కా జూనియర్, అతనితో తనకు ఏ గొడవ ఉండదు అనుకున్నారు. ఇక జగన్ కి ఏమీ తెలియదు, ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కితే చాలన్న సంబరమే ఆయనది అని కూడా తప్పుడు అంచనా వేసుకున్నారు. అందుకే అడుగడుగునా కేసీఆర్ జగన్ కి ఎన్నికల వేళ సపోర్ట్ చేశారని అంటారు. కానీ ఇపుడు చూస్తే సీన్ రివర్స్ అవుతున్నట్లుగా ఉంది.

కమిట్మెంట్ ఎక్కువ :

జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నేతలే. కానీ జగన్ కి తన ప్రాంతం పట్ల కమిట్మెంట్ చాలా ఎక్కువ. అందుకే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టారు, అయితే కేసీఆర్ గోదావరి నీటిని వాడుకోవాలని, ఆ విధంగా వచ్చే మిగులు జలాలతో రాయలసీమను తడుపుకోవాలని సూచించారు. ఇది చెప్పడానికి బాగానే ఉన్నా కూడా అంచనా వేస్తే లక్షల కోట్ల వ్యయం. పైగా తెలంగాణా భూభాగంలో ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ అంతా ఉంచేలా కేసీఆర్ డిజైన్ చేస్తున్నారు. మరి జగన్ అమాయకుడు అనుకున్నారో ఏమో కానీ బేసిన్లూ బేషజాలు లేవు గోదావరి నీళ్ళు వాడుకోమని చెప్పాను అని ఇపుడు అంటున్నారు. కృష్ణా జలాల మీద పూర్తి హక్కు తనదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

హక్కులు హరించుకొపోయి….

పేరుకు కృష్ణా జలాల్లో ఏపీ వాటా అని అంటున్నా హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. కృష్ణా జలాలు కర్నాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల చాలా తగ్గిపోయాయి. మిగిలినవి ఎగువ రాష్ట్రంగా తెలంగాణా ప్రాజెక్టులతో ఇంకిపోతున్నాయి. ఈ నేపధ్యంలో కృష్ణా నదినే నమ్ముకున్న రాయలసీమ జిల్లాలు ఇపుడు నోరు తడుపుకుందుకు లేకుండా ఉన్నాయి. దాంతోనే జగన్ రాయలసీమ ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టారు. పైగా వృధాగా పోయే వ‌రద నీటిని వాడుకుంటానమి చెబుతున్నారు. ఇందులో తెలంగాణాకు పోయేది ఏదీ లేదు కూడా. కానే అంబటేరు పొంగినా దోసిలి నీరే అన్నట్లుగా వరద నీరు సముద్రంలో పోయేది తీసుకుంటామంటే తప్పేంటో కేసీఆర్ సర్కార్ జనాలకు చెప్పాలి. అవన్నీ మానేసి రాజకీయాల కోసమే జగన్ మీద కేసీఆర్ గట్టిగా నోరుచేసుకుంటున్నారు. ఇపుడు జగన్ కూడా గట్టి రిటార్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. చూడబోతే టీఆర్ఎస్ కి జగన్ కంటే బాబే బెటర్ అనిపించవచ్చునేమో. కానీ ఏపీ జనాలకు మాత్రం బాబు కంటే జగనే బెటర్ అనిపిస్తోందిగా.

Tags:    

Similar News