వారికిచ్చిన మర్యాద కూడా లేదే …?

అయోధ్యలో రామాలయం హిందువుల చిరకాల కోరిక. దీనిని సాకారం చేసేందుకు తమ జీవితాలను ఫణంగా పెట్టడమే కాదు అయోధ్య సెంటిమెంట్ పునాదులపై బిజెపి ని అధికారంలోకి తెచ్చిన [more]

Update: 2020-08-04 16:30 GMT

అయోధ్యలో రామాలయం హిందువుల చిరకాల కోరిక. దీనిని సాకారం చేసేందుకు తమ జీవితాలను ఫణంగా పెట్టడమే కాదు అయోధ్య సెంటిమెంట్ పునాదులపై బిజెపి ని అధికారంలోకి తెచ్చిన పెద్దలు వారు. అయితే అయోధ్యలో రామాలయ శంఖుస్థాపనకు ఆహ్వానానికి వారిద్దరు నోచుకోలేదు. వారిద్దరే లాల్ కృష్ణ అద్వానీ, మురళి మనోహర్ జోషి. ఆ ఇరువురు కి ట్రస్ట్ నుంచి ఆహ్వానం వెళ్ళకపోవడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తమ జీవిత చరమాకం లో కోర్టు ల చుట్టూ తిరుగుతూనే ఉండేవారు. అలాంటి వారికి నో ఎంట్రీ తో ఉమా భారతి కి ఆహ్వానం ఉన్నా ఆమె కూడా అయోధ్య కు వెళ్తున్నా అని ప్రకటించినా భూమి పూజ కు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

మోడీ వన్ మ్యాన్ షో కోసమేనా … ?

వాస్తవానికి ఎవరిని ఆహ్వానించాలన్న దానిలో ప్రధాని నరేంద్ర మోడీ కి సంబంధం లేదు. ఇది పూర్తిగా రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం స్వీకరించిన ట్రస్ట్ దే బాధ్యత. అయితే మోడీ ఏమి చేసినా ఎలా చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటారనేది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ ద్వారా ఎవరికి ఆహ్వానం వెళ్ళకూడదో ప్రధాని క్లారిటీ ఇచ్చి వుంటారనే అనుమానాలు పొడచూపుతున్నాయి. దీనితో బాటు అద్వానీ, జోషి బాగా వయోవృద్ధులు కావడం ప్రస్తుతం కరోనా కారణంగా ఆ వయసు వారు బయటకు రావడం ప్రమాదకరం కావడం వల్ల కూడా వీరికి ఇన్విటేషన్ పంపి ఉండరనే వాదన కూడా ఉంది.

వ్యూహాత్మకంగా పక్కన పెట్టారా …?

వీరిద్దరూ వచ్చినా రాకపోయినా ఆహ్వానం పంపి ఉంటె మర్యాదగా ఉండేదన్న వారు ఉన్నారు. మోడీ ప్రధాని వరకు ఎదుగుదలలో అద్వానీ సహకారమే ప్రధానం. గుజరాత్ అల్లర్ల కు బాధ్యుడిగా మోడీని ముఖ్యమంత్రిగా తొలగించాలని వాజ్ పేయి కోరుకున్నా అద్వానీ వత్తిడి తో ఆ ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాత అద్వానీ ని మోడీ వ్యూహాత్మకంగా ఎలా పక్కన పెట్టింది అందరికి తెలిసిందే. భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆ పార్టీ ని రెండు స్థానాలనుంచి పూర్తి స్థాయి మెజారిటీ పార్లమెంట్ లో సాధించడం వెనుక అద్వానీ, వాజ్ పేయి కృషి అందరికి తెలుసు.

వారికిచ్చిన మార్యాద కూడా లేదే …?

అయితే మోడీ హవా కమలంలో మొదలైన నాటినుంచి అద్వానీ ప్రభ క్రమంగా మసకబారుతు వచ్చింది. అద్వానీ ని రాష్ట్రపతి చేస్తారని పార్టీ వర్గాలు భావించినా మోడీ టీం ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసింది. ఇలా పెద్దాయనను పొమ్మన కుండానే పొగబెట్టేసిందన్నది బిజెపి వ్యతిరేకుల విమర్శ. కనిపించే సీన్లు కూడా అదే నిజమనేలా కొనసాగుతున్నాయి. అయితే బిజెపి లో వృద్ధ తరం కి స్వస్తి చెప్పడం సంప్రదాయమే అన్న వాదన వుంది. ఏది ఏమైనప్పటికి రామ్ దేవ్ బాబా, చిన జీయర్ స్వామి, స్వరూపానందేంద్ర, ఇతర మహంతులు సాధు సంతువులకు దక్కిన ఆహ్వాన భాగ్యం రథయాత్ర తో దేశంలో ఆలయ నిర్మాణానికి యుద్ధమే చేసిన అద్వానీ, జోషి లకు దక్కకపోవడం లోటే. అయితే అద్వాని, మురళిమనోహర్ జోషిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొల్గొనే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News