సింథియాను వాడేసుకుని….?

జ్యోతిరాదిత్య సింధియాను …. కాంగ్రెస్ పార్టీ అలా వాడేసుకుంటోందా? రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడైన జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ అగ్రనేతలు క్రమంగా పొగ పెడుతున్నట్లే కన్పిస్తుంది. [more]

Update: 2019-08-31 16:30 GMT

జ్యోతిరాదిత్య సింధియాను …. కాంగ్రెస్ పార్టీ అలా వాడేసుకుంటోందా? రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడైన జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ అగ్రనేతలు క్రమంగా పొగ పెడుతున్నట్లే కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ వంటి మర్రిచెట్టు లాంటి నేతల మధ్య జ్యోతిరాదిత్య సింధియా ఎదగలేకపోతున్నారన్నది ఆయన సన్నిహితుల ఆవేదన. కాంగ్రెస్ పార్టీ కూడా సీనియర్లకే మద్దతు తెలుపుతుండటంతో సింధియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

రాహుల్ వచ్చిన తర్వాత….

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా లాంటి నేతలకు మంచిరోజులు వచ్చాయని అందరూ భావించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయం వెనక జ్యోతిరాదిత్య సింధియా శ్రమ ఉందన్నది పార్టీకి కూడా తెలియంది కాదు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టింది.

సీనియర్లు అడ్డుపడి…..

సీనియర్ నేత కమల్ నాధ్ కు కాకుండా సింధియాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ ఒకదశలో భావించారు. అయితే సోనియాగాంధీ జోక్యంతో కమల్ నాధ్ ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాల్సి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజస్థాన్ లో మాత్రం మరో యువనతే సచిన్ పైలట్ మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

పీసీసీ చీఫ్ పదవి కూడా…..

తర్వాత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పశ్చిమ ప్రాంతాన్ని జ్యోతిరాదిత్యకు అప్పగించారు. అక్కడ సక్సెస్ కాలేదు. ఇక తాజాగా మహారాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా అధిష్టానం నియమించింది. అయితే మధ్యప్రదేశ్ పీసీీసీ చీఫ్ బాధ్యతలను తనకు అప్పగించాలని జ్యోతిరాదిత్య సింధియా గట్టిగా కోరుతున్నారు. అయితే ఇప్పటికే సీఎంగా ఉన్న కమల్ నాధ్ తన వర్గానికే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా హైకమాండ్ కు గట్టి వార్నింగ్ లే పంపినట్లు తెలుస్తోంది. తనకు వచ్చే ఇతర అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ యువనేత డిమాండ్ సోనియా నెరవేరుస్తారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News