సింధియా చేతిలోనే అంతా? కన్నడ వ్యూహమేనట

ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాపైనే అందరి దృష్టి ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా టర్న్ తీసుకున్నాయి. బీఎస్పీ, ఎస్పీలు కూడా బీజేపీకి మద్దతిచ్చాయి. ఆ పార్టీకి చెందిన [more]

Update: 2020-04-06 16:30 GMT

ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాపైనే అందరి దృష్టి ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా టర్న్ తీసుకున్నాయి. బీఎస్పీ, ఎస్పీలు కూడా బీజేపీకి మద్దతిచ్చాయి. ఆ పార్టీకి చెందిన సభ్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కు బలపరీక్షలో మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎక్కువ స్థానాలను సాధించగలిగితేనే సింధియా పరువు నిలబడుతుంది.

యడ్యూరప్ప కూడా….

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పదిహేను స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 స్థానాలను బీజేపీ సాధించడంతో యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకున్నారు. ఇక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. యడ్యూరప్ప చెప్పినట్లుగానే టిక్కెట్లు ఇచ్చారు. ప్రచారంలో కూడా జోక్యం చేసుకోలేదు. భారమంతా యడ్యూరప్ప మీదనే పెట్టారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి పైన కాకుండా సింధియాపై బాధ్యతను మోపనున్నారు.

22 స్థానాల్లో…..

ఈ 25 నియోజకవర్గాల్లో 22 స్థానాల్లో సింధియా వర్గం వారే. వారు ఇటీవల రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తన కోసం రాజీనామా చేసి, కమల్ నాధ్ ప్రభుత్వానికి కారణమైన వారికి తిరిగి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వారిని తిరిగి బీజేపీ గుర్తు మీద గెలిపించాల్సిన బాద్యత కూడా సింధియాపైనే ఉంటుంది. ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఈ విషయాన్ని జ్యోతిరాదిత్య సింధియాకు సూచనప్రాయంగా తెలిపింది.

మంత్రి పదవులంటూ…..

దీంతో సింధియా కూడా కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్ లో వెళ్లాలని భావిస్తున్నారు. 22 మందిలో దాదాపు పన్నెండు మందికి మంత్రి పదవులు దక్కుతాయని ఎన్నికల ప్రచారంలో చేయనున్నారు. కర్ణాటకలో కూడా యడ్యూరప్ప ఇదేరకమైన ప్రచారం చేసి ఆ స్థానాలను గెలిపించుకున్నారు. మంత్రి పదవి దక్కుతుందని తెలిస్తే తమ నియోజకవర్గంలో ప్రజలు కూడా అటువైపు మొగ్గు చూపుతారని కన్నడ ఎన్నికలు తేల్చాయి. అందుకే జ్యోతిరాదిత్య సింధియా సయితం ఇదే వ్యూహంతో వెళ్లాలని యోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News