ఒక త‌ప్పు.. కెరీర్‌ కొలాప్స్

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఒక్కొక్క‌సారి నాయ‌కులు వేసే అడుగులు మం చి గా ఉన్న‌ట్టే ఉన్నా.. భ‌విష్య‌త్తులో అవి శాపాలుగా మారి కెరీర్‌పైనే [more]

Update: 2019-10-03 06:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఒక్కొక్క‌సారి నాయ‌కులు వేసే అడుగులు మం చి గా ఉన్న‌ట్టే ఉన్నా.. భ‌విష్య‌త్తులో అవి శాపాలుగా మారి కెరీర్‌పైనే పెద్ద ప్ర‌భావం చూపించ‌డం ఖాయం గా క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిణామ‌మ‌నే ఎస్సీ వ‌ర్గాల్లో మేధావిగా, ఉన్న‌త విద్యావంతుడిగా పేరున్న జూపూడి ప్ర‌భాక‌ర‌రావుకు ఎదురైంది. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో వేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్‌.. భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కం చేసింది. విష‌యంలోకి వెళ్తే.. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అరంగేట్రం చేశారు జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు మంచి వాయిస్ వినిపించారు. వైఎస్‌కు అత్యంత ప్రియ‌త‌ముల్లో ఒక‌రుగా కూడా జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు గుర్తింపు తెచ్చుకున్నారు.

వైసీపీలో చేరి…

ప్రొఫెస‌ర్‌గా ఉన్న జూపూడి ప్ర‌భాక‌ర్‌రావుని దివంగ‌త వైఎస్ ఏరికోరి మ‌రీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేశారు. వైఎస్ ఉన్న‌న్ని రోజులు కాంగ్రెస్ త‌ర‌పున ఆయ‌న మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు. అయితే, వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అతి త‌క్కువ కాలంలోనే కాంగ్రెస్‌తో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చి .. ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ పంచ‌న చేరారు జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు. ఇక్క‌డ కూడా ఆయ‌న‌కు అనూహ్యమైన గుర్తింపు ల‌భించింది. పార్టీలో అధికార ప్ర‌తినిధిగా ప్ర‌మోట్ అయ్యారు. టీవీ చ‌ర్చ‌ల్లో పార్టీ వాయిస్ వినిపించారు. ఈ క్ర‌మంలోనే 2014లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన ప్ర‌కాశం జిల్లా కొండ‌పిలో వైసీపీ టికెట్ ఇచ్చారు జ‌గ‌న్. అయితే, ఇక్క‌డి పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు, ఆధిప‌త్య ధోర‌ణుల కార‌ణంగా జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు విజ‌యం సాధించ‌లేక పోయారు.

టీడీపీలో చేరి…

త‌న ఓట‌మికి వైసీపీలో కీల‌కంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డిలే కార‌ణ‌మ‌ని జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిపోయారు. చంద్ర‌బాబు వెంట‌నే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నామినేటెడ్ ప‌ద‌విలోనూ జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు ను నియ‌మించారు. దీంతో ఆయ‌న టీడీపీ వాయిస్ వినిపించ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. జ‌గ‌న్‌తో ఉన్న‌న్ని రోజులు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసిన జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి పార్టీ మారాక రివ‌ర్స్‌లో వ్య‌వ‌హ‌రించ‌డం వైఎస్ అభిమానుల‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు.

మంత్రి పదవి గ్యారంటీ….

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. నిజానికి జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు ఆ ఐదేళ్లు.. వైసీపీలో ఉండి, జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచి ఉంటే.. ఇప్పుడు మంచి స్థానంలో ఉండేవారని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్థానంలో జూపూడి ప్ర‌భాక‌ర్‌రావుకి మంత్రి ప‌ద‌వి ద‌క్కి ఉండేద‌ని చెబుతున్నారు. కానీ, ఒకే ఒక్క రాంగ్ స్టెప్ జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు ఫ్యూచ‌ర్‌ను ప్ర‌భావితం చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News