జగన్ దగ్గర జూపూడి పప్పులుడకడం లేదా?

పదవి లేకుండా క్షణం కూడా ఉండలేని నేతలను మనం ఎంతో మందిని చూస్తున్నాం. అందులో జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ [more]

Update: 2020-10-19 05:00 GMT

పదవి లేకుండా క్షణం కూడా ఉండలేని నేతలను మనం ఎంతో మందిని చూస్తున్నాం. అందులో జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి పదవులు పొందడం జూపూడికి అలవాటు. మాలమహానాడు అధ్యక్షుడిగా ఉన్న జూపూడిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా చేశారు. ఇక అప్పటి నుంచి జూపూడి ప్రభాకర్ రావు పదవుల వేటలోనే పార్టీలు మారుతూ వస్తున్నారు.

వైసీపీలో చేరి….

తాజాగా ఆయన వైసీపీలో చేరిపోయారు. అధికారంలోకి వచ్చిన నెల తిరగక ముందే ఆయనకు జగన్ అంతగా నచ్చేశాడు. వెంటనే కండువా కప్పుకున్నాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన జూపూడి ప్రభాకర్ రావు అధికారంలోకి రాకపోయేసరికి టీడీపీలో చేరిపోయారు. ఐదేళ్ల పాటు ఓర్చుకోలేక టీడీపీలో చేరారు. ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చి చంద్రబాబు సత్కరించుకున్నారు.

ఏదో ఒక పదవి వస్తుందని….

జగన్ విషయంలోనూ అదే జరుగుతుందని జూపూడి ప్రభాకర్ రావు భావించినట్లుంది. తాను పార్టీలో చేరిన వెంటనే ఏదో ఒక పదవి వస్తుందని జూపూడి ప్రభాకర్ రావు ఆశించారు. అయితే పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా జూపూడి ప్రభాకర్ రావు ఊసును జగన్ ఎత్తడం లేదు. అంతేకాదు ఆయనకు పెద్దగా పార్టీలోనూ ప్రయారిటీ లభించడం లేదు. జగన్ లెక్కలు జగన్ కు ఉన్నాయంటారు. అందుకే జూపూడి ప్రభాకర్ రావు ను పక్కన పెట్టారంటారు.

నో అంటున్న జగన్……

కష్టసమయంలో పార్టీని వీడివెళ్లి తిరిగి వచ్చిన వారికి జగన్ పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదన్న విషయం జూపూడి ప్రభాకర్ రావు విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆయన ఇప్పుడు కొండపి నియోజకవర్గ ఇన్ చార్జి పదవి కావాలని పట్టుబడుతున్నారని చెబుతున్నారు. సీనియర్ నేతల వద్ద జూపూడి ప్రభాకర్ రావు లాబీయింగ్ చేస్తున్నారట. కానీ ఈ విషయంలోనూ జగన్ జూపూడి ప్రభాకర్ రావు వైపు మొగ్గు చూపడం లేదంటున్నారు. ఒక పద్ధతి లేకుండా పార్టీలు మారే వారికి జూపూడి ప్రభాకర్ రావు భవిష్యత్ లో ఒక ఉదాహరణగా నిలుస్తారేమో చూడాలి.

Tags:    

Similar News