జూపూడి జాడ చెప్పరూ?

సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావు ఎక్కడ? రాజధాని అమరావతిపై ఇంత రచ్చ జరుగుతున్నా జూపూడి జాడ లేకపోవడంపై వైసీపీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీలోనూ, [more]

Update: 2020-01-31 02:00 GMT

సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావు ఎక్కడ? రాజధాని అమరావతిపై ఇంత రచ్చ జరుగుతున్నా జూపూడి జాడ లేకపోవడంపై వైసీపీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీలోనూ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జూపూడి ప్రభాకర్ రావు ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. టీవీ చర్చల్లో అయితేనేమీ, ఎన్నికల సమయంలో అయితేనేమి, వ్యూహాల విషయంలోనూ జూపూడి ప్రభాకర్ రావు సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకునే వారు. జూపూడి ప్రభాకర్ రావు ఏ పార్టీలో ఉన్నా ఆయన వ్యాఖ్యలన్నీ ప్రత్యర్థి పార్టీ అధినేతలనే టార్గెట్ చేసేవిగా ఉండేవి.

టీడీపీ నుంచి…..

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావడంతో జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు జగన్ ను టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగడంతో వైసీపీ క్యాడర్ ఆయన రాకను స్వాగతించలేదు. వైసీపీ క్యాడర్ నుంచే జూపూడి ప్రభాకర్ రావు వ్యతిరేకత రావడంతో ఆయన మౌనంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు ఆ జిల్లా రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

కండువా కప్పుకున్న తర్వాత….

కానీ వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత జూపూడి ప్రభాకర్ రావు జాడే లేదు. ఆయన కండువా కప్పుకుని వెళ్లిపోయారు. ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి ఇంతవరకూ ఇవ్వలేదు. క్యాడర్ లో ఆయన పట్ల విముఖత ఉండటంతో జగన్ కనీసం పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో కూడా జూపూడి పేరును చేర్చలేదు. దీంతో జూపూడి ప్రభాకర్ రావుకు పెద్దగా రాజకీయంగా పనిలేకుండా పోవడంతో ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

రాజధాని విషయంలో…..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చి నెలరోజులకు పైగానే గడస్తుంది. చట్ట సభల్లోనూ ప్రవేశపెట్టింది. అయినా జూపూడి ప్రభాకర్ రావు మూడు రాజధానుల అంశంపై స్పందించకపోవడం గమనార్హం. ఏ హోదా లేనప్పుడు ఏం మాట్లాడతామని జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జూపూడి ఒక్క విజయసాయిరెడ్డి తోనే టచ్ లో ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జూపూడి జాడ ఏదన్న చర్చ రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుండటం విశేషం.

Tags:    

Similar News