జూనియర్ పేరు అంటే… అంతేనట… ?

రాజకీయాలు సినిమాలు కలగలసిపోయిన కాలమిది. నాలుగు దశాబ్దాలుగా ఏపీలో ఇది కొనసాగుతూనే ఉంది. చిరంజీవి నిన్న పార్టీ పెట్టి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తరువాత తమ్ముడు [more]

Update: 2021-09-04 15:30 GMT

రాజకీయాలు సినిమాలు కలగలసిపోయిన కాలమిది. నాలుగు దశాబ్దాలుగా ఏపీలో ఇది కొనసాగుతూనే ఉంది. చిరంజీవి నిన్న పార్టీ పెట్టి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తరువాత తమ్ముడు పవన్ పార్టీ పెట్టి పోటీ చేసి ఓడి మళ్ళీ సినిమాలు అంటున్నారు. అటు రాజకీయం కూడా చేసుకుంటున్నారు. మరి ఈ మధ్యలో సినిమా వాళ్ళకు రాజకీయ బంధాలు చాలానే ఉన్నాయి. స్వయంగా తాత ఎన్టీయార్ పెట్టిన పార్టీ టీడీపీ ఉండడంతో సినిమాలలో ఆయన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ పాలిటిక్స్ తో ముడిపెడుతూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరచి రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా కూడా ఆయన చుట్టూనే రాజకీయం సాగుతూనే ఉంది.

మరీ ఎక్కువైంది…?

ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడాక టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ జపం ఎక్కువైంది. అయితే ఇది ఒక వర్గం నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే. అలా సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా ఆరు నెలల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సాల వేళ జూనియర్ ఎన్టీయార్ పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు నడిపించాలని గట్టిగా కోరుకున్నారు. టీడీపీకి ఆయన అవసరం ఇపుడు చాలానే ఉందని కూడా గోరంట్ల అభిప్రాయపడ్డారు. ఆ కామెంట్స్ టీడీపీ హై కమాండ్ కి ఎక్కడ తగలాలో అక్కడే తగలాలి. నాటి నుంచే గోరంట్లకు టార్చర్ ఎక్కువైందిట. అది చివరికి ఆయన రాజీనామా చేయడానికి సిద్దమవ్వడానికి ఒక కారణంగా తెలుస్తోంది.

హెచ్చరికగానే….?

తెలుగుదేశం పార్టీ ఎవరిది అంటే డౌటే లేదు. నారా ఫ్యామిలీది. అందులో ఎన్టీయార్ సినీ వారసుడు బాలక్రిష్ణ కూడా ఒక సాధారణ సభ్యుడే. ఇక చంద్రబాబుకు ముందు చూపు ఉంది. తెలివి ఉంది. అందుకే తన కొడుకు నారా లోకేష్ కే పగ్గాలు దక్కేలా చాలా ఏళ్ళ నుంచే జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అడ్డు వస్తారని పదేళ్ళ క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టేశారు. ఇక టీడీపీ ఓడినా వాడినా కూడా నారా ఫ్యామిలీ సొంతమే తప్ప నందమూరి వైపుగా మళ్ళేది లేదు అన్నది చంద్రబాబు దృఢ సంకల్పం. అందువల్లనే ఆయన కుమారుడినే ప్రోత్సహిస్తున్నారు. సమర్ధుడో, అసమర్ధుడో లోకేష్ కే జై కొట్టాలి. అది సీనియర్ నేతల నుంచి అందరికీ ఒక్కటే హెచ్చరిగా ఉంది మరి.

సర్దుకోవాల్సిందే …?

ఇపుడు టీడీపీలో రగులుతున్న గోరంట్ల ఎపిసోడ్ పైకి కనిపించేటంత చిన్నదేమీ కాదు. చంద్రబాబు, లోకేష్ బాబులకే తెలుసు గోరంట్ల పదునెంతో, పవర్ ఎంతో. ఆయన టీడీపీలో ఉంటూ తమ నాయకత్వాన పనిచేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంటూ కలవరిస్తున్నారు. అందుకే ఈ కేసుని చాలా శ్రద్ధగానే తండ్రీ కొడుకులు డీల్ చేస్తున్నారు. దీని పర్యావసానాలు, ఫలితాలు ఏమైనా మొత్తం పార్టీకి ఇదొక వార్నింగ్ లాగానే ఉంటుంది అంటున్నారు. గోరంట్ల కి ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి టోటల్ తమ్ముళ్ళు అంతా కూడా జూనియర్ విషయంలో ఇక మీదట పెదవి విప్పకూడదు అంతే. పెదవి దాటి మాట వస్తే పదవులే కాదు, పార్టీకి కూడా దూరమైపోతారు. ఎందుకంటే ఇది నారా వారి పార్టీ. లోకేష్ తరువాత వారసుడూ రెడీగా ఉన్న పార్టీ. అంతే.

Tags:    

Similar News