బాబుకు జూనియర్ ఎప్పటికైనా ఇబ్బందేనా?

చంద్రబాబు నాయుడు సుదీర్ఘర రాజకీయ అనుభవం ఉన్న నేత. పార్టీని అనేకసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును [more]

Update: 2021-06-14 00:30 GMT

చంద్రబాబు నాయుడు సుదీర్ఘర రాజకీయ అనుభవం ఉన్న నేత. పార్టీని అనేకసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును క్యాడర్ నమ్మడం లేదు. అలాగే లోకేష్ నాయకత్వంపై కూడా వారికి నమ్మకం కుదరడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని క్యాడర్ నుంచి తీవ్ర వత్తిడులు వస్తుండటం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది.

ఎన్నడూ లేని సంక్షోభాన్ని….?

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధానంగా నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. చంద్రబాబుకు వయసు మీదపడటం, లోకేష్ కు రాజకీయాలపై పట్టు చిక్కక పోవడంతో దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేసిన క్యాడర్, నేతలు జూనియర్ ఎన్టీఆర్ రాకను కోరుకుంటున్నార. తాజాగా కుప్పం మండలంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు.

దూరం పెట్టడంతో…?

జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో దూరం పెట్టారు. ఎప్పటికైనా తన వారసత్వానికి ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పెద్దగా పట్టించుకోలేదు. హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనకు ప్రయారిటీ ఇవ్వలేదు. 2014 నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు జూనియర్ ను దూరం పెట్టారు.

సొంత నియోజకవర్గం నుంచే?

ఇక ఇప్పుడుపార్టీ పరిస్థిితి బాగాలేదు. వైసీపీిని ఎదుర్కొనడం చంద్రబాబు, లోకేష్ వల్ల కాదని క్యాడర్ లో బలమైన నమ్మకం ఏర్పడింది. పార్టీని వీడిపోయిన వివిధ సామాజికవర్గాలను తిరిగి రప్పించాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలన్నది క్యాడర్ డిమాండ్. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ డిమాండ్ ప్రారంభం కావడం విశేషం. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏ మేరకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తారన్నది సందేహమే.

Tags:    

Similar News