ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఫీవర్..?

‘‘మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు’’. ఇది రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. అయితే, ఈ వ్యాఖ్యలు [more]

Update: 2019-01-22 22:30 GMT

‘‘మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు’’. ఇది రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. అయితే, ఈ వ్యాఖ్యలు కేవలం మేడా మల్లికార్జునరెడ్డిని ఉద్దేశించి చేసినా రానున్న రోజుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో మొదటి నుంచీ ఉన్నవారికి చంద్రబాబు చాలా ప్రాధన్యత ఇస్తారు. ఆ నేతలు సైతం ఇబ్బందులు ఉన్నా అధినేత గీసిన గీత దాటరు. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అది కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరికి కొత్త టెన్షన్ మొదలైంది. అసలు తమకు టిక్కెట్లు దక్కుతాయా లేదా అనే ఆలోచన వారికి కునుకు లేకుండా చేస్తోంది. బయటకు తమకు టిక్కెట్ ఖాయమంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన వారు కూడా టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు.

మంత్రులకు ఢోకా లేదు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో నంద్యాలను మినహాయిస్తే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు. వీరిలో నలుగురు మంత్రులుగా కూడా పనిచేస్తున్నారు. ఆదినారాయణరెడ్డి మినహా మిగతా మంత్రులకు టిక్కెట్ల విషయంలో పెద్దగా అనుమానాలేమీ లేవు. ఆదినారాయణరెడ్డి మాత్రం జమ్ములమడుగు టిక్కెట్ కోసం చాలానే కష్టపడుతున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆదినారాయణరెడ్డిని ఎంపీగా పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీగా వెళ్లేందుకు ఆయన ఏమాత్రం సుముఖంగా లేరు. ఇక, మరో ముగ్గురు ఫిరాయింపు మంత్రులు అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమర్ నాథ్ రెడ్డికి టిక్కెట్ విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఇక, జలీల్ ఖాన్ కూడా విజయవాడ పశ్చిమ టిక్కెట్ ను ఆయన కూతురికి ఖాయం చేసుకున్నారు.

జగన్ కూడా ‘నో’ చెప్పారా..?

అయితే, ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో సుమారు 10 మందికి టిక్కెట్ ఫీవర్ తీవ్రంగా ఉంది. కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డికి టీజీ భరత్ కు మధ్య యుద్ధమే నడుస్తోంది. అద్దంకిలో కరణం బలరాంతోనూ గొట్టిపాటి రవి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పోటీనే చాలా నియోజకవర్గాల్లో ఉంది. దీంతో టిక్కెట్లు ఎవరికి దక్కుతాయో అర్థం కావడం లేదు. అయితే, చంద్రబాబు మదిలో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ సాకుతో టిక్కెట్ ఇవ్వరేమో అనే భయం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉంది. ఇక, అనేక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న పలువురు నేతలకు టిక్కెట్లు కేటాయించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. దీంతో ఆయా స్థానాల్లో సిట్టింగ్ లకు టిక్కెట్లు దక్కవు. ఇలా టిక్కెట్లపై అనుమానాలు ఉన్న కొందరు ఓ వైసీపీ ముఖ్యనేతతో మళ్లీ పార్టీలోకి వస్తామని సంప్రదింపులు కూడా జరిపినా జగన్ నో చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరికైతే టక్కెట్ల కేటాయింపులో కోత పెట్టడం ఖాయం అంటున్నారు. అయితే, వారిలో తామూ ఉన్నామా అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.

Tags:    

Similar News