ఈమెకు మంత్రి పదవి గ్యారంటీయా? టాక్ అదే

మ‌రో ప‌దిమాసాల్లో జ‌గ‌న్ స‌ర్కారు మంత్రి వ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేయ‌నుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎవ‌రు బెస్ట్‌.. ఎవ‌రు వేస్ట్ అనే జాబితాను రెడీ చేసుకున్నట్టు కూడా [more]

Update: 2020-12-01 14:30 GMT

మ‌రో ప‌దిమాసాల్లో జ‌గ‌న్ స‌ర్కారు మంత్రి వ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేయ‌నుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎవ‌రు బెస్ట్‌.. ఎవ‌రు వేస్ట్ అనే జాబితాను రెడీ చేసుకున్నట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ను ప‌క్కన పెట్టడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఈయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో విజిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నార‌ని.. ఇక్కడి స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌డం లేద‌ని స్థానికంగా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. ఇప్పటికే రెండు సార్లు ఈ విష‌యంలో సీఎంవో నుంచి ఆదేశాలు, హెచ్చరిక‌లు కూడా వెళ్లాయ‌ని తెలుస్తోంది.

కౌన్సెలర్ స్థాయి నుంచి……

కౌన్సెల‌ర్ స్థాయి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణ వెంట‌నే సామాజిక వ‌ర్గం కోటాలో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగానే కాకుండా అటు మంత్రిగాను ఆయ‌న ఏ మాత్రం ప్రభావం చూప‌డం లేదు. ఈ విష‌యంలో ఆయ‌న మెత‌క‌వైఖ‌రిది కాస్త త‌ప్పు అయితే జిల్లా వైసీపీలో ఓ వ‌ర్గం ఎమ్మెల్యేలంద‌రూ క‌లిసి ఆయ‌న్ను ముప్పుతిప్పలు కూడా పెడుతున్నారు. శంక‌ర నారాయ‌ణ‌ను ప‌క్కన పెడితే ఇప్పుడు జిల్లా నుంచి మంత్రి వ‌ర్గం రేసులో ఉన్నవారిపై కూడా చ‌ర్చ న‌డుస్తోంది. అనంత‌పురం జిల్లా నుంచి ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి. గ‌తంలోనే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆమె భావించారు. అయితే.. ద‌క్కలేదు. ఆ త‌ర్వాత పార్టీ త‌ర‌ఫున భారీగా ప్రచారంలో ఉన్నారు.

వివాదాలు లేకపోవడంతో…..

జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల‌. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రెండు సార్లు సాకే శైల‌జానాథ్ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2014లో జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి వైసీపీ అభ్యర్థిగా ఓడినా ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌ళ్లీ ఆమెకే సీటు ఇవ్వగా విజ‌యం సాధించారు. మాజీ మంత్రి జేసీ ఫ్యామిలీకి ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 40 వేల ఓట్ల పై చిలుకు భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల అనంత‌రం ప‌ద్మావ‌తి దూకుడుగా ఉండ‌డంతో పాటు టీడీపీలో ముఖ్యులుగా ఉన్న శ‌మంత‌క‌మ‌ణి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకు వ‌చ్చారు. ఇటీవ‌ల ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో 10 కిలో మీట‌ర్ల పాదయాత్ర చేప‌ట్టి స‌క్సెస్ చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై వివాదాలు లేక‌పోవ‌డం.. ప్రధాన పార్టీలు మౌనంగా ఉండ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి.

అది కూడా ఆమెకు ప్లస్సే…….

ఇక‌, ఎస్సీల త‌ర‌పున ప్రస్తుతం రంగంలో ఉన్న వారిలో ఒకింత యాక్టివ్‌గా ఉన్న నాయ‌కురాలు.. జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి కావ‌డం గ‌మ‌నార్హం. ఎస్సీ ( మాదిగ‌) సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన మహిళా ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు జ‌గ‌న్ దృష్టిలో ఉండడం ఆమెకు ప్లస్‌. ఇక జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి భ‌ర్త రెడ్డి వ‌ర్గం కావ‌డంతో ప‌ద్మావ‌తి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోంద‌ట‌. వాస్తవానికి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఎస్సీ నాయ‌కురాలు.. డాక్టర్ శ్రీదేవి కూడా మంత్రి వ‌ర్గంలో చోటు ఆశించారు. అయితే.. ఆమె నిత్యం వివాదాలు.. విభేదాల‌తోనే కాలం వెళ్లదీస్తున్నార‌నే భావ‌న పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఆమెక‌న్నా వైఎస్ కుటుంబంపై ఎంతో అభిమానం ప్రద‌ర్శించ‌డంతో పాటు.. పార్టీని బ‌లోపేతం చేస్తోన్న జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి బెట‌ర‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న జ‌రిగితే.. ఈమెకు మంత్రి ప‌ద‌వి గ్యారెంటీయే అని వైసీపీ వ‌ర్గాల టాక్‌..? ఈ వ‌ర్గంలో మ‌హిళా మంత్రిగా ఉన్న నేత‌ను కేబినెట్ నుంచి త‌ప్పించ‌డం ఖాయం కావ‌డంతో జొన్నలగడ్డ

Tags:    

Similar News