జీవన్ రెడ్డి.. అందరికీ దారి చూపారా?

ఎమ్మెల్యేగా టిక్కెట్ వచ్చినా వారు ఫెయిలయ్యారు. ఓటమి పాలయ్యారు. అయితే వారందరీకీ జీవన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. జీవన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయి [more]

Update: 2020-11-09 11:00 GMT

ఎమ్మెల్యేగా టిక్కెట్ వచ్చినా వారు ఫెయిలయ్యారు. ఓటమి పాలయ్యారు. అయితే వారందరీకీ జీవన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. జీవన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయి ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల నియోజవకర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పట్టం కడుతుండటంతో అది నేతలకు సెంటిమెంట్ గా మారింది. దీంతో త్వరలో జరిగే రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో పోటీ పెరిగింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి…..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన జీవన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన టీఆర్ఎస్ బలపర్చిన చంద్రశేఖర్ పై దాదాపు నలభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించి పెద్దల సభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

టిక్కెట్ల కోసం పోటీ…..

దీంతో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పోటీకి పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఆయనతోపాటు మరికొందరు పోటీ పడుతున్నారు. ఇక్కడ కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతివ్వాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ పెరుగుతుండటంతో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వంపై వ్యతిరేకత…..

ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీకి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, చిన్నా రెడ్డి, సంపత్, వంశీ చందర్ రెడ్డిలు గట్టిగా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం కావడంతో అధికారపార్టీపై వ్యతిరేకత ఉంటుందని, తమకు అడ్వాంటేజీగా ఉంటుందని నేతలు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. వీరందరీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. తాము కూడా జీవన్ రెడ్డి మాదిరిగానే పెద్దలసభలో అడుగుపెట్టాలని భావిస్తుండటంతో కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News