పార్ట్ నర్ పక్కకు జరిగారా? జగన్ వైపు మొగ్గారా?

కొంచెం కామన్ సెన్స్ ఉన్నావారెవరైనా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ చేసిన వ్యాఖ్యలు ఒప్పుకుంటారు. లాక్ డౌన్ లో ఎన్నాళ్లు ఉంటారు. ఎన్ని రోజులు ఉపాధి లేకుండా [more]

Update: 2020-05-01 03:30 GMT

కొంచెం కామన్ సెన్స్ ఉన్నావారెవరైనా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఒప్పుకుంటారు. లాక్ డౌన్ లో ఎన్నాళ్లు ఉంటారు. ఎన్ని రోజులు ఉపాధి లేకుండా పరుల సాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఏసీ గదుల్లో ఎండాకాలంలోనూ దుప్పట్లు కప్పుకునే బ్యాచ్ కు లాక్ డౌన్ బాధలు తెలియవు. కరోనాతో కొన్నాళ్లు సహజీవనం చేయక తప్పదన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు పెడార్థాలు తీశారు. విపరీతాార్థాలు తీశారు. కొందరైతే గూడార్థాలు కూడా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీళ్ల బతుకులింతే అని అనుకోవడం తప్ప ఎవరూ ఏమి చేయలేదు. తాజాగా మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ సయితం జగన్ చేసిన వ్యాఖ్యలు సమర్థించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కరోనాతో సహజీవనం…

జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన పవన్ కల్యాణ్ కు పార్ట్ నర్. జగన్ కరోనాతో సహజీవనం చేయాలని, జ్వరం లాంటిదేనని చెప్పిన మాటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. ఇక చంద్రబాబు నుంచి తెలుగుదేశం నాయకుల సంగతి సరే సరి. ఊపిరితిత్తులను దెబ్బతీసే కరోనాను జ్వరంలాంటిదే అంటారా? అని జగన్ మీద పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్య పెట్టవదని, వారి ప్రాణాలతో చెలగాటాలాడుకోవద్దని పవన్ కల్యాణ్ సుతిమెత్తంగా జగన్ కు హెచ్చరికలు కూడా జారీ చేసి పారేశారు.

మనోధైర్యం ఇచ్చే ప్రయత్నమది…..

అయితే తాజాగా జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “మన ఇంట్లో పిల్లాడికి ఒంట్లో బాగా లేదు. వాడిని ఓదార్చడం కోసం. జ్వరంలే నాయనా. తగ్గిపోతుంది అని ఒక తండ్రిగా చెబుతాం” అని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రోగం పెద్దదయినా పిల్లాడికి మనోధైర్యం ఇవ్వడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నమది. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్ వచ్చిందాకా ఇంట్లోనే ఉందామా?

కరోనా వైరస్ కు మందు లేదు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అలాగని వ్యాక్సిన్ వచ్చిందాకా ఇంట్లోనే కూర్చోవడం అసాధ్యం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్ ప్రజలను మానసికంగా ధైర్యం చెప్పారన్నది మేధావులు సయితం అంగీకరిస్తున్న విషయం. ప్రజలు ఇమ్యూనిటీ పెంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అదే మీడియా మీట్ లో జగన్ చేసిన సూచనలను మాత్రం ప్రస్తావించకుండా సహజీవనాన్నే హైలెట్ చేస్తుండటాన్ని కూడా జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ పార్ట్ నర్ జేడీ లక్ష్మీనారాయణ జగన్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News