ఎద‌గాల‌ని వ‌చ్చినా ఇలా కుదేలై పోయారే?

రాజ‌కీయాల్లో రాణించ‌డం ఒక ఆర్ట్‌. అది అంద‌రికీ సాధ్యం అయ్యే ప‌నికాద‌ని అంటారు అనుభ‌వ‌జ్ఞులు. అయితే.. రాజ‌కీయాల్లో ఎలాగైనా రాణించేయొచ్చని భావించిన కొంద‌రు ఉన్నత‌స్థాయి అధికారులు రిటైర్ [more]

Update: 2021-05-26 14:30 GMT

రాజ‌కీయాల్లో రాణించ‌డం ఒక ఆర్ట్‌. అది అంద‌రికీ సాధ్యం అయ్యే ప‌నికాద‌ని అంటారు అనుభ‌వ‌జ్ఞులు. అయితే.. రాజ‌కీయాల్లో ఎలాగైనా రాణించేయొచ్చని భావించిన కొంద‌రు ఉన్నత‌స్థాయి అధికారులు రిటైర్ అయిన త‌ర్వాత కొంద‌రు.. ముందుగానే వాలంట‌రీ రిటైర్మెంట్ ఇచ్చి మ‌రికొంద‌రు పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి వ‌చ్చారు. అయితే.. వీరిలో ఎందరు రాణిస్తున్నారు? అనే దానికి స‌మాధానం ల‌భించ‌డం లేదు. ఒక‌రిద్దరు త‌ప్ప.. చాలా మంది ఇలా వ‌చ్చిన వారు రాజ‌కీయంగా ఎదురీత ఈదుతున్నార‌నే చెప్పాలి.

స్వచ్ఛంద పదవీ విరమణ చేసి….

గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఓట‌మి పాలయ్యారు. ఈయ‌న ఐపీఎస్ అధికారిగా, స్ట్రిక్ట్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అనూహ్యంగా రాజ‌కీయ రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో ఆయ‌న ప‌వ‌న్ చెంత‌కు చేరి.. త‌న భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకున్నారు. నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు చేస్తాన‌ని, ప్రజ‌ల‌కు ప‌నిచేసి పెడ‌తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకంగా 100 రూపాయ‌ల స్టాంపు పేప‌ర్‌పై హామీలు గుప్పించారు.

ఈ మాజీ ఐపీఎస్ కూడా…?

అయితే ఓటమి త‌ర్వాత ఏకంగా పార్టీకే దూర‌మ‌య్యారు. పార్టీ విధానాలు త‌న‌కు న‌చ్చలేద‌న్నారు. ఇప్పుడు ఎటూ కాకుండా త‌ట‌స్థంగా ఉన్నారు. ప్రస్తుతం వ్యవ‌సాయం చేసుకుంటున్నారు. ఇక‌, గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు మాజీ ఐపీఎస్ చంద్రగిరి ఏసుర‌త్నం. ఈయ‌న‌కూడా మాజీ ఐపీఎస్ అధికారి. డీఐజీగా ప‌నిచేసి.. రిటైర్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న కూడా నిజాయితీనే న‌మ్ముకున్నారు. కానీ, ఓడిపోయారు. ప్రస్తుతం.. మిర్చియార్డు చైర్మన్‌గా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో …?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నా.. క‌ష్టమే అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. ఇక‌, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా ప‌నిచేసిన‌.. వీ. దినేష్ రెడ్డి కూడా 2014 ఎన్నిక‌ల్లో వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే తెలంగాణ‌లోని మ‌ల్కాజ్‌గారి నుంచి వైసీపీ త‌ర‌పున‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. వైసీపీకి దూర‌మ‌య్యారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇలా.. చాలా మంది ఐపీఎస్‌లు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయార‌నే వాద‌న ఉంది. దీంతో రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్న ఉన్నతాధికారులు సైతం వెనుక‌డుగు వేస్తున్నారు.

Tags:    

Similar News