జగన్ పట్ల జేడీ నిర్ణయం మారిందా?

జేడీ లక్ష్మీనారాయణ.. జగన్ ఆదాయనికి మించిన ఆస్తుల కేసును విచారించిన సీబీఐ అధికారి. ఆయన నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. జగన్ అవినీతిపరుడని జేడీ లక్ష్మీనారాయణ [more]

Update: 2020-05-24 11:00 GMT

జేడీ లక్ష్మీనారాయణ.. జగన్ ఆదాయనికి మించిన ఆస్తుల కేసును విచారించిన సీబీఐ అధికారి. ఆయన నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. జగన్ అవినీతిపరుడని జేడీ లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆరోపణలు చేయకున్నా.. ఆయనకు జగన్ అంటే సదభిప్రాయం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా జగన్ కేసులపై జేడీ నేరుగా మాట్లాడకున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేత చెప్పించారంటారు.

టీడీపీకి అనుకూలంగా…..

జేడీ లక్ష్మీనారాయణ కొంత తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా ఉంటారంటారు. అందుకు ప్రత్యేక కారణం కానీ, అభిమానం కాని చంద్రబాబు మీద లేదు. కేవలం జగన్ మీద మంచి అభిప్రాయం లేకపోవడంతో చంద్రబాబు పట్ల జేడీ లక్ష్మీనారాయణ పాజిటివ్ వైఖరిని ప్రదర్శిస్తారు. జేడీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన తర్వాత జనసేన పార్టీలో చేరి విశాఖ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.

జనసేన నుంచి బయటకు వచ్చి…..

జేడీ లక్ష్మీనారాయణ కేవలం పదిహేను రోజులు ప్రచారం చేసినా మూడు లక్షల ఓట్లు వచ్చాయి. ఇది జనసేన అభ్యర్థి అని చెప్పే కంటే ఆయన సొంత ఇమేజ్ మాత్రమే ఈ ఓట్లు రావడానికి కారణమని చెప్పక తప్పదు. తర్వాత జనసేన పార్టీకి కూడా జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ ఫుల్ టైం రాజకీయాలు చేయలేరని భావించి ఆ పార్టీ నుంచి వచ్చేశానని జేడీ లక్ష్మీనారాయణ చెప్పడం విశేషం. ఏ పార్టీలో లేకుండా స్వతంత్రంగా ప్రస్తుతం ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా జేడీ లక్ష్మీనారాయణ జగన్ పాలనపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ పై ప్రశంసలు….

గత ఐదేళ్లు జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు పాలనను చూశారు. ఇప్పుడు 11 నెలల పాటు జగన్ పాలనను ఆయన చూశారు. అయితే జగన్ పాలన పట్ల జేడీ లక్ష్మీనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. అందరిలాగా కాకుండా మ్యానిఫేస్టోలో అంశాలను గ్రౌండ్ చేయడం మంచి విషయమని జేడీ లక్ష్మీనారాయణ జగన్ ను పొగిడారు. జగన్ ఏడాది పాలనపై త్వరలో స్పందిస్తానని కూడా జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. మొత్తం మీద జగన్ పట్ల తనకున్న నెగిటివ్ ధోరణి నుంచి జేడీ లక్ష్మీనారాయణ బయటపడినట్లే.

Tags:    

Similar News