జేసీ దెబ్బకు ఆపేసినట్లుందే….!!

తెలుగుదేశం పార్టీ టికెట్లను దాదాపు మూడొంతులు పనిచేశారు అధినేత చంద్రబాబు. తొలి జాబితాలో 126 మందికి చోటు కల్పించిన బాబు కు అనంతపురం, చిత్తూరు తలపోటు మిగిల్చాయి. [more]

Update: 2019-03-15 03:30 GMT

తెలుగుదేశం పార్టీ టికెట్లను దాదాపు మూడొంతులు పనిచేశారు అధినేత చంద్రబాబు. తొలి జాబితాలో 126 మందికి చోటు కల్పించిన బాబు కు అనంతపురం, చిత్తూరు తలపోటు మిగిల్చాయి. దాంతో అనంతపురంలో ఏకంగా 9 స్థానాలు, చిత్తూరు జిల్లాలో 6 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో పడింది. ఈ నియోజకవర్గాల్లో చిక్కుముడులు ఇంకా వీడకపోవడం తో అధినేత రెండో విడతలో క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురం, చిత్తూరు తరువాత పార్టీ తలపోటు జిల్లాల్లో మూడో స్థానంలో వున్నాయి విశాఖా కర్నూలు జిల్లాలు.

పెండింగ్ లో పెట్టినవి ఇవే….

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పదిస్థానాలకు 9 ప్రకటించి ఒకటి మాత్రం పెండింగ్ పెట్టారు చంద్రబాబు. విజయనగరంలో 7 స్థానాలు క్లియర్ చేయగా 2 పెండింగ్. విశాఖ లో 10 స్థానాలకు క్లియరెన్స్ లభిస్తే 5 స్థానాలను పెండింగ్ లో పెట్టారు టిడిపి అధినేత. ఇక తూర్పు గోదావరి 19 స్థానాలకు 16 క్లియర్ కాగా 3 పెండింగ్ లో ఉంచారు. పశ్చిమ లో మొత్తం 15 స్థానాలకు 11 క్లియర్ కాగా నాలుగు పెండింగ్ లో పడ్డాయి. కృష్ణా జిల్లాలో 14 క్లియర్ అయితే రెండు పెండింగ్ లో వున్నాయి. గుంటూరు 14 క్లియర్ అయిపోయాయి. మూడు స్థానాలే పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. ఇక ప్రకాశం 10 స్థానాలు ప్రకటిస్తే మూడు స్థానాలను మాత్రం పెండింగ్ లిస్ట్ కి చేరాయి. నెల్లూరు జిల్లా లో ఆరు స్థానాలు ప్రకటిస్తే నాలుగు స్థానాలు పెండింగ్ లో పడ్డాయి. చిత్తూరు 8 ప్రకటిస్తే ఆరు స్థానాలు పెండింగ్. కడప ఏడు ప్రకటిస్తే మూడు స్థానాలు పెండింగ్. కర్నూల్ 9 ప్రకటిస్తే ఐదు స్థానాలు పెండింగ్. అనంతపురం ఐదు స్థానాలు ప్రకటిస్తే 9 స్థానాలు పెండింగ్ లో పడ్డాయి.

జెసి పట్టుదలతో ఆ మూడు …

అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని స్థానాలకు బ్రేక్ పడింది. దీనికి ప్రధాన కారణం ఎంపి జెసి దివాకర రెడ్డి అంటున్నాయి పార్టీ వర్గాలు. తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వున్న వాటిలో శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ జిల్లా లో మొత్తం అభ్యర్థులు తేలడానికి మరింత సమయం పట్టనుంది.

Similar News