ఫ్యామిలీ మెంబర్స్ కు జేసీ వార్నింగ్ .. అదేనా?

ఎందుకు నిర్ణయం తీసుకుంటారో గాని… ముందుగానే సిక్త్ సెన్స్ చెప్పిందంటారు కొందరు. నిజంగానే సిక్త్ సెన్స్ అనేది ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే జేసీ దివాకర్ [more]

Update: 2020-09-03 12:30 GMT

ఎందుకు నిర్ణయం తీసుకుంటారో గాని… ముందుగానే సిక్త్ సెన్స్ చెప్పిందంటారు కొందరు. నిజంగానే సిక్త్ సెన్స్ అనేది ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే జేసీ దివాకర్ రెడ్డికి మాత్రం సిక్త్ సెన్స్ ముందుగానే చెప్పిందంటారు. అందుకనే ఆయన రాజకీయ సన్యాసం చేశానని ప్రకటంచారు. గత ఎన్నికలకు ముందు తన వారసులను రాజకీయ అరంగేట్రం చేసేందుకు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినా ఒకరకంగా ఆయనకు మంచి జరిగిందని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయాలకు దూరంగా ఉంటానని…..

నిజానికి జేసీ దివాకర్ రెడ్డి కూడా తమ కుటుంబం ఇంతటి సమస్యను ఎదుర్కొనాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ప్రభుత్వంపై జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ప్రశంసలు కూడా కురిపించారు. జగన్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వంద మార్కులు వేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.

సెటైర్లు వేసినా…..

ఇక రివర్స్ టెండర్లపైనా, సంక్షేమ పధకాలపైనా జేసీ దివాకర్ రెడ్డి అనేక సార్లు సెటైర్లు వేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా తన కుటుంబ సభ్యులందరూ ఓటమి పాలు కావడంతో జేసీ దివాకర్ రెడ్డ యాక్టివ్ గానే కన్పించారు. ఇక చంద్రబాబు ఇస్తున్న కార్యక్రమాలు వేస్ట్ అని కూడా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికార పార్టీకి ఎదురొడ్డి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని జేసీ దివాకర్ రెడ్డి నిర్మొహమాటంగా చెప్పారు. అయితే రెండు నెలల నుంచి జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా మౌనవ్రతం పాటిస్తున్నారు.

రెండునెలలుగా పూర్తిగా…..

తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని రవాణా శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో అరెస్ట్ చేసినప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి బయటకు రావడం లేదు. రెండు నెలల నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. తమ కుటుంబ సభ్యులపై వరస కేసులు నమోదవ్వడంతో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యలకు కూడా సూచించినట్లు తెలిసింది. మరో నాలుగేల్లు నోర్మూసు కూర్చోవడమే బెటర్ అని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన వద్దని కుటుంబ సభ్యులను జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది. జేసీ కుటుంబం అందుకే పూర్తి సైలెంట్ అయిందంటున్నారు.

Tags:    

Similar News