jc brothers : వీళ్లు ఎక్కడికి పోరనేగా?

ఎక్కడైనా నాయకత్వం బలంగా ఉంటే అక్కడ పార్టీ అధినాయకత్వానికి పెద్దగా పని ఉండదు. అక్కడి నాయకత్వమే అన్నీ చూసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం బలంగా ఉన్న [more]

Update: 2021-09-23 15:30 GMT

ఎక్కడైనా నాయకత్వం బలంగా ఉంటే అక్కడ పార్టీ అధినాయకత్వానికి పెద్దగా పని ఉండదు. అక్కడి నాయకత్వమే అన్నీ చూసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం బలంగా ఉన్న చోటనే విభేదాలు ఎక్కువగా కన్పిస్తుండటం విశేషం. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ తన మార్క్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

కొన్ని నియోజకవర్గాల్లో….

ఎవరు అవునన్నా కాదన్నా అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ప్రభావం బాగానే ఉంటుంది. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వారికి వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ఉంది. అయితే అక్కడి స్థానిక నేతలు జేసీ బ్రదర్స్ ను వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గం పరిధిలో జేసీ బ్రదర్స్ వేలు పెడుతున్నారని, కొందరు నేతలను కావాలని పార్టీలో రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

జేసీ కి వ్యతిరేకంగానే…

అయితే చంద్రబాబు మాత్రం జేసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మద్దతు ఇస్తున్నట్లే కన్పిస్తుంది. జేసీ బ్రదర్స్ కు వేరే ఆప్షన్ లేదు. వాళ్లు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి. వైసీపీలోకి వాళ్లు వెళ్లే ప్రసక్తి ఉండదు. దీంతోనే చంద్రబాబు జేసీ బ్రదర్స్ ను కార్నర్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే జిల్లా పదవుల విషయంలో జేసీ బ్రదర్స్ వర్గాన్ని దూరం పెట్టారంటున్నారు.

తగ్గేదేలేదంటున్న…

జేసీ బ్రదర్స్ కూడా తగ్గేదేలేదంటున్నారు. తమ వర్గానికి చెందిన వారి చేత ఎదురుదాడి చేయిస్తూనే ఉన్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో కొందరు కావాలనే నేతలను రెచ్చగొడుతున్నారని జేసీ బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. అందుకే జిల్లాలో ఎక్కడా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేదని, తమకు పెత్తనం కావాలనుకుంటున్న నేతల సత్తా ఏంటో తెలుసుకోవాలని జేసీ బ్రదర్స్ పరోక్షంగా చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద జేసీ బ్రదర్స్ ను కట్టడి చేసే వ్యూహాన్ని చంద్రబాబు త్వరలో అమలుపరుస్తారంటున్నారు.

Tags:    

Similar News