టీడీపీ తమ్ముళ్ళకు పొగపెట్టిన జగన్

అధికారం ఓ మత్తు. దానికి బానిస అయిన వారికి విధేయతలు, వినయాలు అంతగా ఉండవు. దేశంలో గత రెండు దశాబ్దాలుగా కొత్తరకం రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. అవి ధనమయ [more]

Update: 2019-06-15 08:30 GMT

అధికారం ఓ మత్తు. దానికి బానిస అయిన వారికి విధేయతలు, వినయాలు అంతగా ఉండవు. దేశంలో గత రెండు దశాబ్దాలుగా కొత్తరకం రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. అవి ధనమయ రాజకీయాలు. డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కోవడం, ఎన్నికల్లో గెలవడం అధికారంలోకి వస్తే ఫరవాలేదు కానీ పొరపాటున ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీ వైపుగా ఫిరాయించేందుకు రెడీ అయిపోతున్నారు. అయిదేళ్ల పాటు ఉండే ఓపిక లేదు. ఇదే అలుసుగా తీసుకుని అధికార పార్టీ వారు తమ పవర్ ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా ఫిరాయింపులు చేసి బలాన్ని పెంచుకున్న పార్టీలు తరువాత ఎన్నికల్లో గెలిచిందీ లేదు. శాశ్వతంగా అధికారంలో ఉన్నదీ లేదు. కానీ ప్రతిపక్షాన్ని మాత్రం లేకుండా చేసే రాక్షస క్రీడ అన్ని రాష్ట్రాలో విజయవంతంగా సాగిపోతోంది.

టీడీపీలో గోడ దూకుళ్ళు :

ఇదిలా ఉండగా వైఎస్ జగన్ ముఖ్యామంత్రి హోదా నిండు అసెంబ్లీలో కుండబద్దలు కొట్టారు. తాను ఏ ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేను తన పార్టీలోకి తీసుకోనని, ప్రతిపక్షం కూడా పదికాలల పాటు ఉండాలన్నది తన కోరికని స్పష్టంగా చెప్పేశారు. ఇదే సమయంలో జగన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, తాను ఒకే అంటే చాల మంది గోడ దూకేసి వస్తారని కూడా జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఫిరాయింపుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన స్పీకర్ కి కూడా విన్నపం చేయడం గమనార్హం తన పార్టీలోకి చేరాలనుకుంటే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని జగన్ చెప్పేశారు.

నోరు కట్టేసారా :

ఇక్కడో విషయం ఉంది. జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందే చాలా మంది ఆ పార్టీలో చేరిపోయారు. ఇక గెలిచిన తరువాత చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి రాయబారాలు పంపుతున్నారని కూడా ప్రచారం సాగింది. జగన్ స్వయంగా చెప్పిన తరువాత అది నిజమేనని తేలిపోయింది. జగన్ తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను తీసుకోనని స్పష్టంగా చెప్పయేడమే కాదు ఎవరైనా ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాల్ని కూడా స్పీకర్ ని కోరడంతో బీజేపీలోకి వెల్దామనుకుంటున్న ఎమ్మెల్యేల్కు కూడా ఇపుడు నోట్లో వెలక్కాయ పడింది. వారు ఏ వైపు ఫిరాయించినా ఎటూ చంద్రబాబు వూరుకోరు. దాంతో స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే ఆయన తప్పక యాక్షన్ తీసుకుంటారు. దీంతో జగన్ ప్రకటనతో ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా టీడీపీలో కొనసాగాల్సివుంటుంది. లేకపోతే జగన్ చెప్పినట్లుగా వారు పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి. ఈ తతంగం అంతా దండుగ, గెలుస్తారో లేదో డౌట్ కాబట్టి ఇపుడు తమ్ముళ్ళకు జగన్ బాగానే పొగ పెట్టినట్లుంది.

Tags:    

Similar News