తండ్రీకొడుకుల కధ ముగిసినట్లేనా?

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగకముందే జనతాదళ్ ఎస్ చేతులెత్తేసే పరిస్థిితి కనపడుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని పటిష్టం చేసుకోవాలనుకున్న జేడీఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలకు [more]

Update: 2019-11-30 16:30 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగకముందే జనతాదళ్ ఎస్ చేతులెత్తేసే పరిస్థిితి కనపడుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని పటిష్టం చేసుకోవాలనుకున్న జేడీఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలకు ఎన్నికలకు ముందే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఊహించని షాక్ లు వారికి ఎదురవుతున్నాయి. ఉప ఎన్నికలు మొత్తం 15 స్థానాల్లో జరుగుతుండగా మొత్తం గెలవగలిగిన, పోటీ ఇవ్వగలిగిన స్థానాలను జనతాదళ్ ఎస్ కుమారస్వామి ఒక అంచనా వేసుకున్నారు.

అంచనా వేసి మరీ….

మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పన్నెండు చోట్ల జేడీఎస్ కు అవకాశం ఉందని భావించి ఆయన అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇందులో నామినేషన్లను కొందరు ఉప సంహరించుకోవడంతో అభ్యర్థుల ఎంపిక కూడా సక్రమంగా జరగలేదని దీన్ని బట్టి అర్థమయింది. రెండు స్థానాల్లో ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థికి, మరొకచోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వాలని కుమారస్వామి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రచారం చేయాలని కూడా భావించారు.

ఉప సంహరించుకున్న….

కాని రెండు చోట్ల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హిరేకరూర్ నియోజకవర్గంలో లింగాయత్ వర్గానికి చెందిన స్వామీజీకి కుమార్వామి టిక్కెట్ ఇచ్చారు. ఇక్కడ లింగాయత్ ల ప్రాబల్యం ఎక్కువ ఉండటం, స్వామీజీ పోటీ చేస్తే తిరుగుండదని కుమారస్వామి అనుకున్నారు. అందుకోసం హిరేకరూర్ కు శివలింగ శివాచార్య స్వామీజీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. స్వామీజీ బరిలో ఉంటే తమ గెలుపు కష్టమవుతుందని భావించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వామీజీని బరి నుంచి తప్పుకోవాలని కోరారు. తన కుమారుడు రాఘవేంద్రను స్వయంగా స్వామీజీ వద్దకు పంపారు. అనూహ్యంగా స్వామీజీ బరి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు హరేకరూర్ లో జేడీఎస్ కు అభ్యర్థి లేకుండా పోయారు.

సొంత పార్టీ నేతలే…..

అలాగే అధణి నియోజకవర్గంలో కూడా జేడీఎస్ అభ్యర్థి గరుదాస్కళ తన నామినేషన్ ను ఉపసంహరించుకుని బరి నుంచి తప్పుకున్నారు. గురుదాస్కళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వత్తిడి మేరకు నామినేషన్ ను ఉప సంహరించుకున్నారు. చిక్కబళ్లాపురలో జేడీఎస్ అభ్యర్థి కేపీ బచ్చే గౌడ నామినేషన్ తిరస్కరణకు గురయింది. ఇలా మూడు చోట్ల ముందుగానే జేడీఎస్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లయింది. ఇక మాండ్య పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేఆర్ పేట నియోజకవర్గంలో అభ్యర్థికి మద్దతుగా సొంత పార్టీ నేతలే ప్రచారానికి రావడం లేదు. ఇలా అభ్యర్థుల ఎంపికలోనే కుమారస్వామి ఓటమిపాలయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News