బీజేపీ ఓపెన్ అయ్యింది మరి జనసేన …?

అచ్చెన్న అరెస్ట్ పై ముందుగా పాత ఆ తరువాత కొత్త బిజెపి నేతలు స్వాగతించారు. మిగిలిన అక్రమార్కులను లోపల వేయండి అని కూడా గట్టిగానే సపోర్ట్ ఇచ్చింది. [more]

Update: 2020-06-15 08:00 GMT

అచ్చెన్న అరెస్ట్ పై ముందుగా పాత ఆ తరువాత కొత్త బిజెపి నేతలు స్వాగతించారు. మిగిలిన అక్రమార్కులను లోపల వేయండి అని కూడా గట్టిగానే సపోర్ట్ ఇచ్చింది. పనిలో పని తెలుగుదేశం, వైసిపి కూడా అవినీతి పార్టీలే నని వీరికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని పిలుపునిస్తుంది బిజెపి. అంతే కాదు వచ్చేసారి తమకు, జనసేన కు మద్దతుగా నిలిస్తే పాలన ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు రుచి చూపించేస్తామని చెప్పేస్తుంది కమలం. ఇలా తాము భవిష్యత్తులో సైకిల్ ఎక్కేది లేదని పరోక్షంగా కూడా స్పష్టం చేసేస్తోంది కమలదళం.

జనసేన లో లేదు చలనం …

ప్రస్తుతం ఏపీ లో అచ్చన్నాయుడు, జెసి బ్రదర్ ఆయన కుమారుడి అరెస్ట్ వ్యవహారమే హాట్ టాపిక్. అయితే ఈ వ్యవహారంలో బిజెపి నేతలు ఉన్నంత దూకుడు ను జనసేన ప్రదర్శించకపోవడం కూడా చర్చకు దారి తీస్తుంది. గత ఎన్నికల్లో పరాజయం తరువాత నుంచి టిడిపి కి దగ్గరగానే జనసేన అడుగులు పడ్డాయి. రాజధాని తరలింపు ను అడ్డుకునే అంశంలో కూడా సైకిల్ తో టీ గ్లాస్ జతకట్టే నడిచింది.

కమలం మాటకు సై అంటారా … ?

ఆ తరువాత కట్ చేస్తే అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమలంతో చేతులు కలిపి ఎపి రాజకీయాలను కొత్త మలుపు తిప్పేశారు. ఇరు పార్టీలు ఒకే మాట ఒకే బాటగా తరువాత నడుస్తాయని అనుకున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఎవరిదారి లో వారు వెళుతూ కొన్ని కీలక అంశాల్లో కలిసే సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎపి లో రెండు కీలక అంశాల్లో జనసేన విస్పష్టంగా తన వైఖరిని వెల్లడించాలిసి ఉంది. అయితే జనసేన మాటను కూడా ఇప్పుడు బిజెపి నేతలే వల్లెవేయడం దాన్ని పవన్ పార్టీ ఖండించకపోవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయింది.

Tags:    

Similar News