పరవాలేదనిపించారా? ఫ్యూచర్ ఉన్నట్లేనా?

పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు కనపర్చిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పరవాలేదని పంచింది. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటే జనసేన పార్టీ మెరుగైన ఫలితాలన [more]

Update: 2021-03-14 12:30 GMT

పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు కనపర్చిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పరవాలేదని పంచింది. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటే జనసేన పార్టీ మెరుగైన ఫలితాలన సాధించలందినే చెప్పాలి. ఏ ఒక్క మున్సిపాలిటీలో అధికారంలోకి రాకపోయినా అనేక వార్డుల్లో కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మంచి పెర్ ఫార్మెన్స్ చూపించింది.

కొన్ని చోట్ల బలంగా….

అమలాపురం, జంగారెడ్డి గూడెం గూడెం వంటి మున్సిపాలిటీల్లో జనసేన బలాన్ని నిరూపించుకోగలిగింది. ప్రధానంగా కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. అనేక చోట్ల బలమైన పోటీని ఇవ్వగలిగారు. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన వరస షూటింగ్ లు ఉండటంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా రాలేకపోయారు.

పవన్ ప్రచారానికి రాకపోయినా….

గుర్తు మీద జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అన్ని చోట్ల పోటీకి దింపడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ తో అక్కడి నేతలు లోపాయికారీ అవగాహన కుదుర్చుకున్నారు. మరికొన్ని చోట్ల తమ పార్టీ ప్రభావం ఏంటో చూపించగలిగారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి మున్సిపల్ ఎన్నికలు ఉపయోగ పడ్డాయనే చెప్పక తప్పదు.

జనసైనికులదే విజయం…..

అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం వెనక పవన్ కల్యాణ్ పాత్ర కంటే జనసైనికుల పాత్ర ఎక్కువనే చెప్పుకోవాలి. గెలిచిన కొద్దిస్థానాలైనా అక్కడ జనసేన క్యాడర్ బలంగా పనిచేసింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ పార్టీ జెండా ను క్యాడర్ ఎగుర వేయగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన జనసేన పార్టీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొంత ప్రభావం చూపగలిగింది. ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. ఇది జనసేన కు కొంత ఊరట కల్గించే అంశమే.

Tags:    

Similar News