ఇద్దరు భలే దొరికారుగా

టిడిపికి కష్టకాలంలో పవన్ కల్యాణ్ ఆదుకుంటారనే విమర్శలు ఆరోపణలు ఎలా ఉన్నా వాటిని చాలావరకు ఆయన నిజం చేస్తూనే వచ్చారు కూడా. అయితే తమ పార్టీపై ఈ [more]

Update: 2020-01-12 11:00 GMT

టిడిపికి కష్టకాలంలో పవన్ కల్యాణ్ ఆదుకుంటారనే విమర్శలు ఆరోపణలు ఎలా ఉన్నా వాటిని చాలావరకు ఆయన నిజం చేస్తూనే వచ్చారు కూడా. అయితే తమ పార్టీపై ఈ మైండ్ గేమ్ ను తిప్పికొట్టేందుకు అధికార వైసిపి సైతం జనసేన నేతనే ప్రత్యర్థులపై ప్రయోగించి వారి వ్యూహాలకు చెక్ పెట్టేస్తుంది. ఒక పక్క టిడిపి కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరంగా మారితే, అదే పార్టీ రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ వైసిపికి వరంగా మారిపోయారు. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. చంద్రబాబు పై ఈగ వాలితే పవన్, జగన్ మోహన్ రెడ్డి పై ఈగ వాలితే రాపాక స్పందించడం పవర్ పాలిటిక్స్ నే వేడెక్కిస్తున్నాయి.

బాబు తో పవన్ ప్రయాణం …

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ల రాజకీయ ప్రయాణం 2014 లో మొదలై మొన్నటి ఎన్నికలకు ఆరునెలల ముందు మాత్రమే విడిపోయింది. దాదాపు నాలుగున్నరేళ్ళపాటు వైసిపి స్పీడ్ అయినప్పుడల్లా లేదా రాజకీయంగా టిడిపి మైనస్ లో పడిందన్నప్పుడు వెంటనే జనసేనాని ప్రత్యక్షం అయి మీడియా ఫోకస్ మొత్తాన్ని మార్చేసేవారు. అత్యంత జనాకర్షణ సినీ గ్లామర్ తోడు కావడంతో పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టలేని పరిస్థితిలో మీడియా మొత్తం ఆయన హడావుడితో సరిపోయేది. వైసిపి కి ఈ పరిణామాలు జీర్ణించుకోలేని పరిస్థితిని కల్పించేవి.

రాపాకను లైన్లో పెట్టాక …

బాబు వ్యూహాన్ని పూర్తిగా దెబ్బకొట్టేందుకు వైసిపి సైతం పక్కా స్కెచ్ గీసేసింది. జనసేన లో గెలిచిన ఏకైక ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ను తురుపు ముక్కగా చేసుకుని పవన్ కల్యాణ్ పై వరుస విమర్శలు జగన్ పై వరుస ప్రశంసలు కురిపించుకుంటూ హై డ్రామాకు తెరలేపింది. జనసేన తరుపున ఏకైక ఎమ్యెల్యే కావడం, అధినేతతో సహా అంతా ఓటమి చెందినా ఒకే ఒక్కడుగా రాపాక విజేత కావడంతో ఆయనకు సెలబ్రిటీ హోదా దక్కేసింది.

చెక్ పెడుతూ….

దాన్నే అడ్డుపెట్టుకుని రాపాక కీలక తరుణాల్లో అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు వాడిగా వేడిగా చేస్తూ సొంత పార్టీలో అయోమయానికి గురిచేస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు జనసేనకు మింగుడు పడటం లేదు. దాంతో బాటు టిడిపికి అసలు రుచించడం లేదు. పార్టీ అధినేతను పూచికపుల్లలా రాపాక తీసిపారేస్తున్న వైనం కూడా జనసైనికులకు అయితే మరింత ఇబ్బందిగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న రీతిలో అటు టిడిపి గేమ్ కి వైసిపి చెక్ పెడుతూ నడుస్తున్న పవన్ కల్యాణ్ – రాపాక ల యవ్వారం ఇంకెన్నాళ్లో చూడాలి.

Tags:    

Similar News