అన్నయ్యే అడ్డుపడ్డాడే

ఇద్దరు తెలుగు సినిమా తెరపై ధృవతారాలుగా వెలిగినవారే. వారు కనపడితే జననీరాజనాలు రొటీన్ గా కనిపించేవి. అయితే రేటింగ్స్ విషయానికి వచ్చినా అన్నను దాటే తమ్ముడు ఉండేవాడు. [more]

Update: 2019-11-04 02:02 GMT

ఇద్దరు తెలుగు సినిమా తెరపై ధృవతారాలుగా వెలిగినవారే. వారు కనపడితే జననీరాజనాలు రొటీన్ గా కనిపించేవి. అయితే రేటింగ్స్ విషయానికి వచ్చినా అన్నను దాటే తమ్ముడు ఉండేవాడు. కానీ చిత్రంగా ఆదివారం తమ్ముడిని మించి పోయాడు అన్నయ్య. వారిద్దరే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు. ఇద్దరు రెండు చోట్ల భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో పవర్ స్టార్ తన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ ను విశాఖ వేదికగా నిర్వహించి తన సత్తా చాటి చెబితే మెగాస్టార్ బుల్లితెర పై బిగ్ బాస్ 3 ముఖ్య అతిధిగా పాల్గొని అలరించారు. ఈ ఇద్దరు పాల్గొన్న కార్యక్రమాలు భిన్నమైనవి అయినా చిరంజీవి దెబ్బకు పవన్ సభ రేటింగ్స్ టీవీల్లో ఢమాల్ మని పడిపోవడం కాకతాళీయం.

అంతా బిగ్ బాస్ వైపే …

జనసేన మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇసుక కొరతపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం. జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని విపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. బిజెపి, కామ్రేడ్ లు దీంట్లో పాల్గొనకపోయినా తమ మద్దతు ప్రకటించారు కూడా. అయితే తెలుగుదేశం మాత్రం మద్దతు తో బాటు తమ పార్టీ ముఖ్యనేతలను పవన్ కార్యక్రమానికి పంపింది. ఏపీ లో వాడి వేడి రాజకీయ చర్చకు ఈ కార్యక్రమం తెరతీసింది కూడా. అయితే మార్చ్ పూర్తి అయి సభ ప్రారంభం అయ్యే సమయంలో తెలుగురాష్ట్రాల్లో గత కొద్ది నెలలుగా అంతా బుల్లితెరలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 3 ఫైనల్ డే కావడం తమ్ముడి పొలిటికల్ షో ను తీవ్రంగా దెబ్బతీసింది.

అన్నయ్య షో తమ్ముడు మార్చ్ …

కారణం బిగ్ బాస్ కార్యక్రమానికి మెగాస్టార్ ముఖ్యఅతిధిగా రావడం తో బాటు ఆ షో కి వున్న విపరీతమైన రేటింగ్స్ జనసేన జనం కోసం చేసిన మెగా నిరసన ను ప్రజలకు చేరువ చేయలేకపోయింది. విశేష సంఖ్యలో పవన్ సభకు 13 జిల్లాలనుంచి జనసైనికులు హాజరు అయ్యి కార్యక్రమం సూపర్ హిట్ అయినా ఛానెల్స్ లో టిడిపి మీడియా విస్తృతంగా చాలా కాలం తరువాత జనసేనకు ప్రచారం కల్పించినా అనుకున్న స్థాయిలో రేటింగ్స్ లేకుండా పోయింది. న్యూస్ ఛానెల్స్ లో ఒక పక్క పవన్ కార్యక్రమం లైవ్ నడుస్తున్నా వందల సంఖ్యలో మాత్రమే వీక్షకులు వీక్షించగా అదే సమయంలో బిగ్ బాస్ షో లక్షల్లో వీక్షించడం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, ప్రజల్లో పాలిటిక్స్ పై వున్న నిరాసక్తత, వినోద కార్యక్రమాలపై వున్న మక్కువ మరోసారి దీంతో రుజువు అయ్యింది. అలాగే తమ్ముడు భారీ కార్యక్రమానికి అనుకోకుండా అన్నయ్యే అనుకోకుండా అడ్డు కావడం జనసేన మైలేజ్ కి దెబ్బ కొట్టింది.

Tags:    

Similar News