పవన్ దెబ్బకు ఆ ఆశకూడా లేకుండా పోతుందా?

కూటమి అన్నప్పుడు పట్టువిడుపులు ఉండాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన కూటమిల మధ్య సయోధ్య కన్పించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. [more]

Update: 2021-02-04 05:00 GMT

కూటమి అన్నప్పుడు పట్టువిడుపులు ఉండాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన కూటమిల మధ్య సయోధ్య కన్పించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంకేతాలు కూడా ఆ యా పార్టీల క్యాడర్ లోకి బలంగా వెళ్లింది. ఇప్పుడు నేతలు కలసి వచ్చినా క్యాడర్ ఎంతమేరకు సహకరిస్తుందన్న చర్చ రెండు పార్టీల్లో జరుగుతుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెంచాయనే చెప్పాలి.

బీజేపీ తొలి నుంచి….

తిరుపతి ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. తిరుపతి ఉప ఎన్నిక బరిలో దిగేందుకు బీజేపీ తొలి నుంచి ఉత్సాహం చూపుతుంది. పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తొలి నుంచి బీజేపీ కసరత్తులు చేస్తూనే ఉంది. మండలాల వారీగా ఇన్ ఛార్జులను నియమించుకుంది. పదే పదే తిరుపతిలో సమావేశాలను ఏర్పాటు చేసుకుని క్యాడర్ లో ఉత్సాహం నింపింది. అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలించింది.

తమకే బలం ఉందని…..

ఇక తిరుపతి నుంచి రామతీర్థం వరకూ రధయాత్రకు కూడా బీజేపీ సిద్ధమయింది. ఇవన్నీ తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చేసినవే. పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ కూడా నెలలో రెండుసార్లు తిరుపతిలో ప్రత్యక్షమవుతున్నారు. మరోవైపు జనసేన సయితం తిరుపతిలో తామే పోటీ చేయాలని భావిస్తుంది. తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని, అక్కడ తమ పార్టీకే బలం ఉందని జనసేన వాదించింది.

ఏ అభ్యర్థి బరిలో ఉన్నా….

దీనికితోడు జనసేన అభ్యర్థి పోటీలో ఉంటేనే తాను ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో ప్రచారం చేస్తానని ప్రకటించారు. అంటే బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే తాను పెద్దగా ప్రచారం చేయనని పవన్ కల్యాణ్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ ఒక పార్టీ మరొక పార్టీ క్యాడర్ సహకరించే పరిస్థితి లేదు. టీడీపీని వెనక్కు నెట్టి రెండోస్థానంలోనైనా నిలవాలనుకున్న బీజేపీకి అది సాధ్యపడేలా కన్పించడం లేదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News