పొత్తు పై స్థాయిలోనేనా? కింది స్థాయిలో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని దాదాపు ఆరు నెలలు గడుస్తుంది. పై స్థాయిలో అగ్ర నేతలు కలసి కూర్చుని కార్యాచరణపై [more]

Update: 2020-08-10 09:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని దాదాపు ఆరు నెలలు గడుస్తుంది. పై స్థాయిలో అగ్ర నేతలు కలసి కూర్చుని కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. జనసేన, బీజేపీలు ఉమ్మడిగా సమావేశమై గతంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రెండు పార్టీలు కలసి కూర్చుని చర్చించుకుని కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి.

పవన్ నుంచి క్లారిటీ లేక…..

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన, బీజేపీ నేతలు కలవడం కష్టంగా మారింది. తొలి నుంచి బీజేపీతో జనసేన జట్టుకట్టడం పవన్ హార్డ్ కోర్ అభిమానులకు కూడా రుచించలేదు. వారు సోషల్ మీడియాలో నేరుగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీతో ఎందుకు తాను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించలేదు. కనీసం టెలికాన్ఫరెన్స్ లో కూడా ఆయన ఈ పొత్తు విషయాలపై మాట్లాడటం లేదు.

రెండు పార్టీలు కలసి…..

అందుకే క్షేత్రస్థాయిలో జనసేన నేతలు బీజేపీతో కలసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటరన్న అనుమానం కావచ్చు. పవన్ కల్యాణ‌్ క్లారిటీ ఇచ్చిన తర్వాత వారితో కలసి పని చేయాలని భావించి ఉండవచ్చు. కానీ అనేక చోట్ల జనసేన, బీజేపీ జెండాలు కలసి కన్పించకపోవడం విశేషం. ముఖ్యంగా జగన్ పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖలో ఈరెండు పార్టీలదీ తలోదారి అయింది. జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారే కలసి పనిచేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో ఎవరికి వారే….

విశాఖలో బీజేపీకి విష‌్ణుకుమార్ రాజు, మాధవ్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. జనసేనకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన జేడీ లక్ష్మీనారాయణ, చింతలపూడి, బాలరాజు వంటి నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ వంటి నేతలే ఉన్నారు. వీరు బీజేపీ నేతలతో కలసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేేయడం లేదు. ఒక్క విశాఖలోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంతా జనసేన, బీజేపీ నేతలు కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ కిందిస్థాయిలో క్లారిటీ ఇస్తే తప్ప కలయిక సాధ్యం కాదంటున్నారు.

Tags:    

Similar News